
Viral News woman left her computer job and set up tea shop is now earning in lakhs
Viral News : మనదేశంలో టీకి ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే.. పొద్దున లేస్తే ఎన్ని సార్లు టీ తాగుతారో వాళ్లకే తెలియదు.. పేదవాడి నుంచి సంపన్నుడి వరకు అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు. ఇక వర్షాకాలం, చలికాంలో టీ లేకుండా అస్సలు ఉండలేరు. చాయ్ ని రకరకాలుగా పిలుస్తూ వెరైటీగా ఆర్డర్ వేస్తుంటారు.. ఇక మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది కూడా చామ్ అంట. ముఖ్యంగా మన దేశంలో టీ ప్రియులు కోట్లలో ఉన్నారు. దీంతో విదేశాల్లో కూడా ఫుల్ ఫేమస్ అయింది.
ఇక మన దేశం నుంచీ చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతోంది. అసోం, డార్జిలింగ్ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇండియాలో అత్యంత సంపన్నుల నుంచీ అంత్యంత పేదల వరకూ అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒకప్పుడు టీ, కాఫీ మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడో ఒక్క టీలోనే ఎన్నో రకాలు వచ్చేశాయి. లెక్కలేనన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. అయితే టీ ప్రియులు తమకు నచ్చితే అక్కడే ఎక్కువగా టీ తాగడానికి ఆసక్తి చూపుతారు.. ఎక్కడున్నా సరే.. ఎంత దూరం ఉన్నా సరే టీ నచ్చిదంటే వచ్చి తాగి వెళ్తారు. అలా టీ షాప్స్ కి మంచి పేరుంటుంది.
Viral News woman left her computer job and set up tea shop is now earning in lakhs
ఇక సినిమాల్లో చాయ్ పై ఎన్నో పాటలు కూడా వచ్చాయి. ఇక ప్రధాని మోడీ కూడా చాయ్ వాలా అంటుంటారు.. ఓ యువతి కూడా తను చేస్తున్న జాబ్ మానేసి ఓ టీ స్టాల్ పెట్టింది మంచి ఆదాయం పొందుతోంది. రాజ్ కోట్ కు చెందిన మహిళ నిషా హుస్సేన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీ కొట్టు పెట్టింది. రాజ్ కోట్ లో ఛాయి వాలీ.. అనే టీ కొట్టులో పనిచేసి కొంతకాలం అనుభవం తెచ్చుకుని ది చైలాండ్ అనే టీ కొట్టు పెట్టి సక్సస్ అయింది. పది రకాల టీలు అందిస్తూ ఫుల్ ఫేమస్ అయింది. అయితే నిషా టీ వ్యాపారం చేస్తుండడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా 2017 లో కంప్యూటర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రహస్యంగా టీ అమ్మడం ప్రారంభించింది.
ఇక తనకు ప్రత్యేకంగా టీలు అమ్మడం చిన్నప్పటి నుండి అలవాటైందని చెప్తోంది. తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మొదట్లో కస్టమర్లు ఎక్కువగా వచ్చేవారు కాదట. దాదాపు15 రోజులు తను చేసిన టీ అంతా వృథా అయిందంట.. ఇక ఓ రోజు ఓ కస్టమర్ తన వ్యాపారం గురించి ఇన్ స్టా గ్రామ్ లోపెట్టాడట. ఆ వీడియో వైరల్ కావడంతో నిషా టీ స్టాల్ ఫేమస్ అయిందంట. దీంతో జనం తనను రాజ్ కోట్ చాయ్ వాలీ అని పిలవడం సంతోషంగా వుందని చెప్తోంది. ఇక ప్రతీ నెలా రూ. 50,000 పైగా ఆదాయం సంపాదించిందట. అయితే కారోనా పాండమిక్ లో టీ స్థాల్ మూసివేయవల్సి వచ్చిందట. దీంతో కొంత నష్టపోయిందట.
ఇక తిరిగి జూన్ లో మళ్లీ టీ షాప్ తెరిచిందట.. కానీ ఇదివరకటిలాగా కస్టమర్లు రావడం లేదట.. అయినా నిరుత్సాహ పడకుండా వ్యాపారం చేస్తోందట. ఇక రాజ్ కోట్ ప్రజలు తనకు ఎంతో ప్రేమాభిమానాలు అందించారని చెబుతోంది. అందుకే వ్యాపారంలో సక్సెస్ అయ్యానని అంటోంది. అలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తన వద్దకు తీసుకు వచ్చి తన విజయాన్ని వారి పిల్లలకు చెబుతున్నారట. దీంతో నిషా గర్వంగా ఫీలవుతోందట.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.