Chiranjeevi : చిరంజీవి మూవీ టైటిల్ లీక్ చేసిన శేఖర్ మాస్టర్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చిరు.. బాలకృష్ణ లాగా సింగిల్ సినిమాలు తీయకుండా ఎక్కువ మల్టీస్టారర్ మూవీలపైనే ఫోకస్ పెడుతున్నాడన్న అంశంపై సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. చిరు వయసు అయిపోతుందని భయంతో తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఇలా మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ప్రస్తుతం విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. త్వరలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో అభిమాని, స్టార్ హీరో మధ్య జరిగే ఎమోషనల్ కథను చూపించబోతున్నాడు బాబీ. అయితే చిరంజీవి వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. అయితే ఈ వయసులో కూడా జోరుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్. అయితే చిరు తన సినిమాల్లో మరో స్టార్‌ను పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే చిరంజీవి- బాబీ సినిమాకి సంబంధించి కొద్ది రోజులుగా పలు టైటిల్స్ ప్రచారం అవుతున్నాయి.
Chiranjeevi : మేటర్ లీక్..
తాజాగా శేఖర్ మాస్టర్ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తుండగా, ఈ క్రమంలో చిరంజీవి బాబీ సినిమా విషయంలో టైటిల్ లీక్ చేశాడు. తనకు తెలియకుండానే ఆ విషయం బయటకు వచ్చేసినట్టుంది. ఎందుకంటే చిరంజీవి బాబీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అది మరీ ఓల్డ్ పేరుగా ఉందని, ఇంకో టైటిల్ ట్రై చేస్తున్నారంటూ కూడా కథనాలు వచ్చాయి. అయితే సినిమాకి వాల్తేరు వీరయ్య అని టైటిల్ పెట్టారని చెప్పకనే చెప్పేశాడు. ఆసినిమాలో ఓ పాట కంపోజ్ చేస్తానని చెప్పేశాడు. ఇప్పటికే భోళా శంకర్ చిత్రంలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసేశాని అన్నాడు.