Venu sriram : వేణు శ్రీరాం నాతో సినిమా చేస్తావా.. మెగాస్టార్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu sriram : వేణు శ్రీరాం నాతో సినిమా చేస్తావా.. మెగాస్టార్..!

 Authored By govind | The Telugu News | Updated on :10 April 2021,7:03 pm

Venu sriram : వేణు శ్రీరాం పేరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాకి దర్శకుడు కావడమే. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయం అయింది ఓ మై ఫ్రెండ్ సినిమాతో. ఈ సినిమా 2011 లో వచ్చింది. దాదాపు పదేళ్ళు అయినప్పటికీ వేణుశ్రీరాం చేసింది కేవలం రెండు సినిమాలే. ఓ మై ఫ్రెండ్ తర్వాత మళ్ళీ నాని – సాయి పల్లవితో ఎం.సి.ఏ సినిమా చేశాడు. వీటిలో డెబ్యూ సినిమా భారీ ఫ్లాపవగా రెండవ సినిమా యావరేజ్ టాక్ దగ్గర ఆగిపోయింది.

ఇక ఈ రెండు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించాడు వేణు శ్రీరాం. కాగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కి దర్శకుడిగా దిల్ రాజు బాధ్యతలు అప్పగించడం అందరికీ షాకిచ్చింది. కానీ ఇప్పుడు వేణు శ్రీరాం వాళ్ళందరికీ షాకిచ్చాడు. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ని సత్య దేవ్ పాత్రలో ఇంత పవర్ ఫుల్ గా చూపిస్తాడని ఏ ఒక్కరు భావించలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఇంత పెద్ద హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం వేణు శ్రీరాం కే దక్కుతోంది. అంతగా తనలోని సత్తాని బయట పెట్టి తనని తాను నిరూపించుకున్నాడు.

Chiranjeevi offers to venu sriram

Chiranjeevi offers to venu sriram

Venu sriram : చరణ్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తే బావుంటుందని సూచించారట మెగాస్టార్.

ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ మీద అలాగే దర్శక, నిర్మాతలు చిత్ర యూనిట్ సభ్యులందరినీ గొప్పగా ప్రశంసించారు. ఈ క్రమంలో దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరాం లను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ క్రమంలోనే దర్శకుడు వేణు శ్రీరాం కి మెగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్వయంగా మెగాస్టారే.. ” వేణు శ్రీరాం ని నాతో సినిమా చేస్తావా”.. అని అడిగారట. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగా చరణ్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తే బావుంటుందని సూచించారట మెగాస్టార్. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది