Chiranjeevi : చిరంజీవిది కోపమా ఓవర్ యాక్షనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరంజీవిది కోపమా ఓవర్ యాక్షనా..!

Chiranjeevi : మెగాస్టార్ కెమెరా ముందు ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను దాదాపు 40 సంవత్సరాలు నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి కెమెరా ఆన్ అయింది అంటే చిరంజీవిలోని మరో మనిషి బయటకు వస్తాడు. అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా.. కెమెరా కళ్ళు తనను చూస్తున్నాయని తెలిసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటాడు చిరంజీవి. ఎట్టి పరిస్థితుల్లో తన టెంపర్ లాస్ అవ్వడు.. చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 October 2022,6:00 pm

Chiranjeevi : మెగాస్టార్ కెమెరా ముందు ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను దాదాపు 40 సంవత్సరాలు నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి కెమెరా ఆన్ అయింది అంటే చిరంజీవిలోని మరో మనిషి బయటకు వస్తాడు. అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా.. కెమెరా కళ్ళు తనను చూస్తున్నాయని తెలిసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటాడు చిరంజీవి. ఎట్టి పరిస్థితుల్లో తన టెంపర్ లాస్ అవ్వడు.. చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి చిరంజీవికి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో పీకలదాకా కోపం వచ్చింది. మీడియాను అనరాని మాటలు అనేశాడు.. ఆ తర్వాత ఆయింట్మెంట్ రాశాడు. అసలు ఇందులో చిరంజీవి నిజంగా కోపంగా మాట్లాడారా లేదంటే ఓవర్ యాక్షన్ చేశాడా..?

సాధారణంగా మీడియా ముందు చాలా ప్రశాంతంగా కనిపించే చిరంజీవి.. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మాత్రం చాలా కోపంగా కనిపించాడు. ఎప్పుడూ లేని విధంగా మీడియాను వేలెత్తి చూపడమే కాకుండా.. తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించాడు. ఇదంతా ఆచార్య సినిమా తాలూకు కోపమా లేదంటే గాడ్ ఫాదర్ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావడం లేదన్న ఫ్రస్టేషన్ ఆ అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అంతగా లేవు. అసలు విషయం ఏమిటంటే గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మీడియా గురించి కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యాడు చిరంజీవి. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శించారు అంటూ మీడియా తమపై రాసిన వార్తలను తప్పుపట్టాడు మెగాస్టార్. తమ సినిమా గురించి తమకు తెలుసు అని..

Chiranjeevi on anger is over action

Chiranjeevi on anger is over action

Chiranjeevi : ఏమైందని అంత కోపం..

ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని విషయం కూడా తమకు తెలుసు కదా.. అది కూడా మీడియా నిర్దేశిస్తే తామెందుకు సినిమాలు చేయడం అంటూ సీరియస్ అయ్యాడు చిరంజీవి. అక్కడితో ఆగకుండా అనంతపురం ప్రీ రిలీజ్ వేడుకలు వర్షం పడినా కూడా తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాడు చిరు. ఒకవేళ ఆరోజు తాను మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే.. మీడియా ఎంత పెంట పెంట చేశారో అనే భయంతోనే అప్పటికప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడాను అని.. అంతేతప్ప అందులో ఎలాంటి స్క్రిప్టు లేదు అని క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి. ముందు మీడియాపై ఇన్ని విమర్శలు చేసిన ఈయన.. గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన తర్వాత అదే మీడియా నెత్తిన పెట్టుకొని చూసుకుంది అంటూ ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేశాడు. అప్పటికే తిట్టాల్సిన తిట్లు అన్ని తిట్టిన తర్వాత చివర్లో ఆయింట్మెంట్ రాసిన లాభం లేదు కదా అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది