
Chiranjeevi - Ravi Teja in the flops, will they hit together
Chiranjeevi – Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టారు. ఆ తర్వాత వరుసగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్స్‌ను కమిటయ్యారు. అయితే, కరోనా వల్ల చిరు సినిమాలన్నీ ఆలస్యం అవుతూ వచ్చాయి. దాదాపు నాలుగేళ్ళ సమయం చిరు, చరణ్ ఒక్క ఆచార్య సినిమాకే కేటాయించారు. కానీ, ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే, ఇప్పుడు ఆయన తర్వాత సినిమాల మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది దసరాకి మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇంత భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా గాడ్ ఫాదర్ సినిమా మీద అంతగా అంచనాలు లేవు.
అదీ కాక..ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ అంతగా ఆకట్టుకోలేదు. ఇక భోళా శంకర్, మెగా 154 కూడా సెట్స్ మీద ఉన్నాయి. భోళా శంకర్ కూడా కొత్త కథేమీ కాదు. కాబట్టి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. చిరుకి హిట్ పడితే అది మెగా 154 తోనే అంటున్నారు. ఇందులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న మాస్ మహారాజా కూడా వరుసగా అరడజను సినిమాలు కమిటయ్యాడు. అయితే, క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడి సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇప్పుడు చేస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ దసరాకి వస్తుంది. ఈ సినిమా హిట్ అయితే రవితేజ మళ్ళీ ఫాంలోకి వస్తాడు. లేదంటే కాస్త సినీ కెరీర్ రిస్క్‌లో పడుతుంది.
Chiranjeevi – Ravi Teja in the flops, will they hit together
చేతిలో ఉండటానికి ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాలున్నాయి. కానీ ఎంతవరకు అవి కొత్త కథలతో తెరకెక్కుతున్నాయో తెలియదు. అయితే, రవితేజ కి కూడా మెగా 154 మూవీ మీదే చాలా ఆశలున్నట్టు టాక్. మెగాస్టార్ – మాస్ మహారాజ కలిసి చేస్తున్న ఈ మాస్ మల్టీస్టారర్ ఖచ్చితంగా భారీ హిట్ అనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వెల్లడవుతున్నాయి. అరాచకం ఆరంభం అంటూ వదిలిన మెగా 154 ఫస్ట్ పోస్టర్ ఒక్కటే భారీగా అంచనాలు ఏర్పరచింది. అందుకే, అటు మెగాస్టార్ కి గాని, ఇటు రవితేజకి గానీ మెగా 154 చాలా కీలకంగా మారింది. కొడితే ఒకేసారి ఒకే సినిమాతో భారీ హిట్ ఖాయం అంటున్నారు. మరి సంక్రాంతికి రాబోతున్న మెగా 154 సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు మాస్ రాజా అభిమానులకి ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తుందో తెలియాలంటే 2023, సంక్రాంతి వరకు వెయిట్ చేయాలసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.