Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో మాస్ మహారాజ.. పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ మల్టీస్టారర్..?

Authored By vamana sai | The Telugu News | Published on: September 30, 2021, 6:00 am

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో ఏ హీరో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆయనతో ఒక్క ఫ్రేం లో కనిపించినా చాలనుకునే స్టార్ హీరోలున్నారు. అది కేవలం మన టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో ఉన్న స్టార్స్ అందరూ చిరుతో చిన్న సీన్ చేయాలనుకుంటారు. అయితే ఇప్పటికే చాలాసార్లు చిరంజీవితో రవితేజ నటిస్తాడని వార్తలు వచ్చాయి. వాస్తవంగా శంకర్ దాదా సినిమాలో కూడా శ్రీకాంత్‌కి బదులు రవితేజనే చేయాల్సింది.

Chiranjeevi raviteja multi starrer movie

Chiranjeevi raviteja multi starrer movie

కానీ ఆ సమయంలో రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండటం వల్ల చిరు-రవితేజ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే అన్నయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా నటించాడు రవితేజ. ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో మెగాస్టార్ ఆఫర్ చేసిన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకుండా కొన్ని క్షణాలు మెరిశాడు. అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి – రవితేజ కలిసి భారీ మల్టీస్టారర్‌గా రూపొందనున్న సినిమాలో నటించబోతున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వచ్చి బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రామారావు సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

Chiranjeevi raviteja multi starrer movie

Chiranjeevi raviteja multi starrer movie

Chiranjeevi : వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ఆ తర్వాత మెగాస్టార్.. బాబి దర్శకత్వంలో నటించబోతున్న సినిమాలో రవితేజ నటించనున్నాడట. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇటీవలే ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఊటీలో షెడ్యూల్ మొదలైంది. ఆ తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలు మొదలవనున్నాయి. ఈ క్రమంలోనే బాబి – మెగాస్టార్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర చేయనున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Chiranjeevi raviteja multi starrer movie

Chiranjeevi raviteja multi starrer movie

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp