Chiranjeevi : కొద్ది నిమిషాల యాడ్ కోసం కళ్లు చెదిరే పారితోషికం అందుకున్న చిరంజీవి
Chiranjeevi : కొన్నాళ్ల పాటు రాజకీయాలు చేసిన చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఏజ్ పెరుగుతున్నా.. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ యాడ్స్‌తోను దుమ్ము రేపుతున్నాడు. రీసెంట్‌గా శుభగృహ` కోసం చిరు ఓ యాడ్ చేశారు. సుకుమార్ దీనికి దర్శకత్వం వహించారు. చిరుతో పాటు ఖుష్బూ, అనసూయ ఈ యాడ్‌లో కనిపించారు. ఉగాది సందర్భంగా ఈ యాడ్ ని విడుదల చేశారు. 30 సెకన్ల ఈ యాడ్ లోనూ.. చిరు తన కామెడీ టైమింగ్ ఏమాత్రం మిస్ కాలేదు. పైగా మరింత యంగ్ లుక్‌లో కనిపించారు.
అయితే సుకుమార్ తెరకెక్కించిన యాడ్ అందరిని ఆకర్షించింది. చిరుతో ఓ సినిమా చేయాలన్నది సుకుమార్‌కల. దానికి తొలి మెట్టుగా.. ఈ యాడ్ ఫిల్మ్ ఉపయోగపడింది. చిరు కూడా సుకుమార్ డైరెక్షన్‌లో చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వెండి తెరపై ఈ కాంబినేషన్ చూసే అవకాశం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కమర్షియల్ యాడ్ కోసం మెగాస్టార్ 7 కోట్లు తీసుకున్నారట. ఇప్పటి వరకు తెలుగులో యాడ్ ఫిల్మ్స్ లో నటించిన ఏ హీరో కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోలేదట. అప్పుడెప్పుడో మెగాస్టార్ థమ్స్ అప్ యాడ్ లో నటించి ఆకట్టుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు.

chiranjeevi remuneration 7 crores for ad
Chiranjeevi : బాగానే పెంచేశాడుగా..
రాజకీయాల్లోకి వెళ్ళిన చిరు 2017 లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. వరుస సినిమాలతో చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు సినిమాల వరకూ ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ ఆచార్య రిలీజ్ కు రెడీగా ఉంటే.. గాడ్ ఫాదర్ సెట్స్ మీద ఉంది. డైరెక్టర్ బాబీతో, మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాలతో ప పాటు వెంకీ కుడుమలతో మరో సినిమా ఫిక్స్ అయ్యారు. మరో రెండు సినిమాలు కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.