Chiranjeevi : బన్నీ గురించి సీక్రెట్ బయట పెట్టిన చిరంజీవి
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ..సైరా తర్వాత నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆచార్య సినిమా విడుదలకు సంబంధించి మీడియాతో మాట్లాడిన చిరంజీవి… ప్రపంచంలో కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. అన్ని రంగాల్లాగే సినిమా రంగం కూడా నష్టపోయిందని తెలిపారు. కరోనా వల్ల బడ్జెట్‌పై వడ్డీలకు వడ్డీలు పెరిగాయని చెప్పారు. తాము ప్రభుత్వాలకు 42 శాతం పన్ను కడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలను వేడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు.
సీక్రెట్ రివీల్..
భారీ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటించగా.. కొన్ని కారణాల వల్ల అనూహ్యంగా ఆమెకు సంబంధించిన సీన్స్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థానం భర్తీ అయ్యేలా కొరటాల పెద్ద స్కెచ్చే వేశారట. ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకొచ్చారట. అంతేకాదు చివరలో ఆమెతో ఓ సాంగ్ షూట్ కూడా చేశారని ఇన్‌సైడ్ టాక్. ‘ఆచార్య’ రిలీజ్ రోజునే వెండితెరపై అనుష్క ఎంట్రీ చూసి తెలుగు ప్రేక్షకలోకం హుషారెత్తిపోవాలనేది కొరటాల ప్లాన్ అన్నట్లు ఫిలిం నగర్ టాక్.

chiranjeevi reveals the secret of bunny
ఇక తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలియజేశారు. హరీష్ శంకర్ మీ కామెడీ సినిమాల్లో చంటబ్బాయి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తీస్తే బాగుంటుంది, ఆ రోల్ లో ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అని అడగగా దీనికి సమాధానంగా చిరంజీవి.. బన్నీ అయితే బాగుంటుందని అన్నాడు. బన్నీ బేసిక్ గా మిమిక్ కూడా. అన్ని కామెడీ వాయిస్ లు బాగా చేస్తాడు. అందుకే చంటబ్బాయి సినిమాని బన్నీ మాత్రమే చేయగలడు” అని తెలిపారు. దీంతో బన్నీ మిమిక్రి కూడా చేసి నవ్విస్తాడనే సీక్రెట్ చిరు బయట పెట్టేశారు. బన్నీ అభిమానులు ఇది తెలుసుకొని ఆనందిస్తున్నారు.