Chiranjeevi : చిరంజీవి – అనీల్ రావిపూడి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్.. సంగీతం ఎవరంటే..!
ప్రధానాంశాలు:
Chiranjeevi : చిరంజీవి - అనీల్ రావిపూడి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్.. సంగీతం ఎవరంటే..!
Chiranjeevi : వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మెగాస్టార్‌కి మంచి హిట్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు రు చిరు. నెక్ట్స్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ చేయనుండగా, ఈ సినిమా కోసం ఇప్పట్నుంచే హీరోయిన్ల వేట మొదలైంది.

Chiranjeevi : చిరంజీవి – అనీల్ రావిపూడి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్.. సంగీతం ఎవరంటే..!
Chiranjeevi ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
ఈ చిత్రం కోసం భూమిక లేదా అదితి రావు హైదరిని కథానాయికగా సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి హాఫ్ స్క్రిప్ట్ ఫినిష్ అయినట్టు తెలుస్తుండగా, జూన్ మధ్యలో నుండి మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. రమణ గోగుల చిత్రంలో ఒక సాంగ్ పాడనున్నారని సమాచారం. ఇక ఈ మూవీలో చిరంజీవి పాత్ర గ్యాంగ్ లీడర్‌లో తను చేసిన పాత్రకి చాలా దగ్గరగా ఉంటుందని సమాచారం.
చిరంజీవి గ్యాంగ్ లీడర్ స్టయిల్‌లో మూవీ సాగుతుందని, చిరంజీవి పాత్ర కూడా అలానే ఉంటుందని అంటున్నారు . అందులో రాజా రామ్‌గా చిరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీలోనూ అదే స్టయిల్, మ్యానరిజంతో క్యారెక్టర్‌ని డిజైన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తుండగా, ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ డిలే అవుతుందని, మరికొన్ని నెలలు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది