Chiranjeevi : మోడీతో వేదిక పంచుకోబోతున్న చిరంజీవి.. ఆనందంగా ఫీల‌వుతున్న మెగా ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : మోడీతో వేదిక పంచుకోబోతున్న చిరంజీవి.. ఆనందంగా ఫీల‌వుతున్న మెగా ఫ్యాన్స్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ వ్యాప్తంగాను మంచి క్రేజ్ ఉంది. సినిమా వాళ్ల నుండి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు చిరంజీవిని ఎంత‌గానో ఇష్టప‌డుతుంటారు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని చాలా మంది ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి స్టార్స్‌గా మారారు.తాజాగా మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జూలై 4వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 June 2022,4:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ వ్యాప్తంగాను మంచి క్రేజ్ ఉంది. సినిమా వాళ్ల నుండి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు చిరంజీవిని ఎంత‌గానో ఇష్టప‌డుతుంటారు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని చాలా మంది ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి స్టార్స్‌గా మారారు.తాజాగా మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం.

ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జూలై 4వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కిషన్ రెడ్డి..చిరంజీవిని కోరారు.

chiranjeevi shares stage with modi

chiranjeevi shares stage with modi

Chiranjeevi : క్రేజీ న్యూస్..

మన్యం వీరుడిగా, హీరో ఆఫ్ జంగల్‌గా ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు అందరికీ సుపరిచితుడని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. నాటి బ్రిటీషు వ్యతిరేక పోరాటంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్ని ఏకం చేసి పోరాడిన వైనాన్ని మర్చిపోలేమని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు. కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ వార్తతో చిరు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది