Home » Entertainment » Chiranjeevi Shares Stage With Modi
Entertainment

Chiranjeevi : మోడీతో వేదిక పంచుకోబోతున్న చిరంజీవి.. ఆనందంగా ఫీల‌వుతున్న మెగా ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 29, 2022, 4:30 pm
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ వ్యాప్తంగాను మంచి క్రేజ్ ఉంది. సినిమా వాళ్ల నుండి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు చిరంజీవిని ఎంత‌గానో ఇష్టప‌డుతుంటారు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని చాలా మంది ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి స్టార్స్‌గా మారారు.తాజాగా మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం.

Advertisement

ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జూలై 4వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కిషన్ రెడ్డి..చిరంజీవిని కోరారు.

chiranjeevi shares stage with modi

Advertisement

Chiranjeevi : క్రేజీ న్యూస్..

మన్యం వీరుడిగా, హీరో ఆఫ్ జంగల్‌గా ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు అందరికీ సుపరిచితుడని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. నాటి బ్రిటీషు వ్యతిరేక పోరాటంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్ని ఏకం చేసి పోరాడిన వైనాన్ని మర్చిపోలేమని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు. కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ వార్తతో చిరు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి