Home » Entertainment » Chiranjeevi To Be Brother Of Nayanathara
Entertainment

Chiranjeevi : చిరంజీవి చెల్లెలుగా నయ‌న‌తార‌.. అలా లీక్ చేశాడేంటి?

Authored By
Sam C
The Telugu News | Published on: June 18, 2022, 10:00 pm
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వ‌ర‌స‌పెట్టి సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న చేస్తున్న సినిమాల‌లో ఇప్పుడొక విష‌యం గుర్తించాలి. ఆయ‌న హీరోయిన్స్ తో పెద్ద‌గా రొమాన్స్ చేసిన దాఖ‌లాలు లేవు. స్టార్ హీరోయిన్స్ ఆయ‌న సినిమాలో న‌టించ‌న కూడా వారు చెల్లెలి పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టించ‌గా, ఇప్పుడు న‌య‌న‌తార కూడా చిరంజీవి చెల్లెలుగా న‌టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్‌గా వస్తున్నాడు.

Advertisement

ఇందులో మంజిమా మోహన్ నటించిన పాత్రలో నయనతార నటించనున్నట్టుగా ముందు నుంచీ లీకులు వస్తూనే ఉన్నాయి.అలా లీక్ చేశాడు.. మొత్తానికి ఇప్పుడు తమన్ మాత్రం అనధికారికంగా వాటిని కన్ఫామ్ చేసేశాడు. ఇక ఈ మూవీ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్‌గా వాగ్దేవి నిలిచింది. ఆమెకు ట్రోఫీతో పాటు 10 లక్షల బహుమానం లభించింది. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది. అయితే వైష్ణవి గొంతుకు మాత్రం చిరంజీవి ఫిదా అయ్యాడు.

chiranjeevi to be brother of Nayanathara

Advertisement

అంతే కాకుండా గాడ్ ఫాదర్‌లో ఓ పాట కూడా పాడుతోందని చెప్పేశాడు.పాట వరకు చెప్పకుండా.. బ్రదర్ అండ్ సిస్టర్ సాంగ్ అని లీక్ ఇచ్చేశాడు. చిరంజీవి, నయనతార బ్రదర్ అండ్ సిస్టర్లుగా నటిస్తున్నారని, వారిపై వైష్ణవీ పాట పాడుతోందని చెప్పేశాడు. అలా మొత్తానికి తమన్ మాత్రం లీక్ ఇవ్వడంతో వాటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తమన్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. టాప్ హీరోలందరికీ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అది కాకుండా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు జడ్జ్‌గా చేసి తనలోని ఇంకో కోణాన్ని బయటకు చూపించాడు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి