Chiranjeevi vs Mohan babu : చిరంజీవి VS మోహన్ బాబు.. మరోసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi vs Mohan babu : చిరంజీవి VS మోహన్ బాబు.. మరోసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి..!

Chiranjeevi vs Mohan babu : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులతో మాట్లాడారు. రిపబ్లిక్ డే నా జీవితంలో ప్రత్యేకతను సంతరించుకుందని పద్మ విభూషణ్ రావటం చాలా సంతోషం అని అన్నారు. 45 […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,5:33 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi vs Mohan babu : చిరంజీవి VS మోహన్ బాబు.. మరోసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి..!

Chiranjeevi vs Mohan babu : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి అభిమానులతో మాట్లాడారు. రిపబ్లిక్ డే నా జీవితంలో ప్రత్యేకతను సంతరించుకుందని పద్మ విభూషణ్ రావటం చాలా సంతోషం అని అన్నారు. 45 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో కళామతల్లికి సేవ చేసుకోవడం ఆర్టిస్టులకు ఏదైనా విపత్తు వచ్చిన ఆదుకోవడం లాంటి సామాజిక సేవ చేస్తూ వచ్చాను.

సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో రక్తం కొరత లేకుండా ఉంది నేను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమందికి సేవ చేస్తున్నా. ఇదంతా నా అభిమానుల వల్లనే జరిగింది అని అన్నారు. నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అందరికీ రుణపడి ఉంటాను అని ఇదే స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తూ ఉంటాను. ఇక 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు నా కళా సేవను సామాజిక సేవను గుర్తించి పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి అన్నారు. అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అని చిరంజీవి తెలిపారు.

ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్ బాబు చిరకాల స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాల అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నామని ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు వెల్లడించారు. వీరిద్దరి మధ్య గొడవలు లేవని తెలుస్తుంది కానీ ఒకానొక టైంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అన్నది వాస్తవం. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పబ్లిక్ గా ఇద్దరు మంచిగా ఉంటారని తెలుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది