Chiranjeevi : రెండేళ్ల పాటు ఒకే చొక్కా ధరించిన చిరంజీవి.. కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జీవితం తెరచిన పుస్తకం. ఆయన కష్టపడి ఈ స్థాయిలో ఉండడం వలననే ఆయన ఫ్యామిలీ సభ్యులు అందరు ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. 1955, ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25 వ ఏటా అంటే 1980లో నాటి ప్రసిద్ద హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గరు సంతానం. ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ , కుమారుడు రామ్ చరణ్. ఆయన కెరీర్‌లో 150కి పైగా చిత్రాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందాడు.
Chiranjeevi : అసలు కారణం ఇది..!
చిరంజీవికి తన బర్త్‌డే ఆగస్ట్ 22 ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్ 22 కూడా అంతే స్పెషల్. ఎందుకంటే ఆయన నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’విడుదలైంది ఈ రోజే. 1978 సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌ని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘ప్రాణం ఖరీదు’నాకు ఎప్పుడూ స్పెషలే అని చిరంజీవి చెబుతుంటాడు. ఎంతటి స్టార్ హీరో అయినా కెరీర్ లో ఫ్లాప్ లు తప్పవు. మెగాస్టార్ లో కెరీర్ లో కూడా ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న అంజి సినిమా మాత్రం మెగాస్టార్ ను ఎక్కువ నిరాశ పరించింది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
1997 లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అప్పటి నుండి మీడియాలో అంజి సినిమా వార్తలు తరచూ కనిపించేవి. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి ఏడేళ్లు పట్టింది. అప్పట్లోనే 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 2004 లో విడుదల అయ్యింది. సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్ ను ఉపయోగించారు. ‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్‌ని దాదాపు రెండేళ్ల పాటు తీశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి మరుపురాని చిత్రమని చెప్పాడు .