Teja : తేజ.. టాలీవుడ్ లో ఒక సెన్షేషన్ అని చెప్పాలి. కేవలం 35 నుంచి 40 లక్షల లోపే చిత్రం సినిమాని తీసి నిర్మాత రామోజీరావుకి భారీగా లాభాలు తెచ్చి పెట్టాడు. అప్పటి వరకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరొల సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన తేజ టాలీవుడ్ లో చిత్రం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కథని కేవలం 35 లక్షల్లో తీస్తానని రామోజీరావుతో చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనుకున్నట్టుగానే తీశాడు. ఈ సినిమా ద్వారా అందరినీ కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ ఆ తర్వాత కూడా కొత్త వాళ్ళతోనే నువ్వు నేను, ధైర్యం, జయం లాంటి సినిమాలు తీశాడు.
chitram-1-1-with-tejas-son
ఇక స్టార్ హీరోలు మహేష్ బాబు, రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రాం లతో కూడా తేజ సినిమాలు తీసి హిట్ కొట్టాడు. కాగా గత ఏడాది తేజ గోపీచంద్ తో అలివేలు మంగ వెంకటరమణ, అలాగే రానాతో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ గోపీచంద్ సినిమాకి హీరోయిన్ దొరకక ప్రాజెక్ట్ పెండింగ్ పడిందన్నారు. ఈ క్రమంలో సడన్‌గా చిత్రం సినిమా సీక్వెల్ తీస్తున్నట్టు తేజ ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్ లోగో కూడా వదిలారు. చిత్రం 1.1 పేరుతో తెరకెక్కనున్న సినిమాలో దగ్గుబాటి హీరో పరిచయం అవుతున్నాడని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎం.టి.ఆర్ బావమరిది నితిన్ చంద్ర హీరోగా పరిచయం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఇదే వార్త అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కన్‌ఫ్యూజన్ కూడా నెలకొంది. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యేది దగ్గుబాటి అభిరాం ఆ లేక ఎన్.టి.ఆర్ బావమరిదా అని. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రం 1.1 తో తేజ తన కొడుకు అమితోవ్ తేజ్ నే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. తేజ కొడుకు ఇప్పటికే రెండు మూడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవమన్నది త్వరలో అఫీషియల్ న్యూస్ రానుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.