Teja : తేజ కొడుకుతో చిత్రం 1.1..?

Authored By vamana sai | The Telugu News | Published on: April 7, 2021, 1:59 pm

Teja : తేజ.. టాలీవుడ్ లో ఒక సెన్షేషన్ అని చెప్పాలి. కేవలం 35 నుంచి 40 లక్షల లోపే చిత్రం సినిమాని తీసి నిర్మాత రామోజీరావుకి భారీగా లాభాలు తెచ్చి పెట్టాడు. అప్పటి వరకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరొల సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన తేజ టాలీవుడ్ లో చిత్రం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కథని కేవలం 35 లక్షల్లో తీస్తానని రామోజీరావుతో చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనుకున్నట్టుగానే తీశాడు. ఈ సినిమా ద్వారా అందరినీ కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ ఆ తర్వాత కూడా కొత్త వాళ్ళతోనే నువ్వు నేను, ధైర్యం, జయం లాంటి సినిమాలు తీశాడు.

chitram-1-1-with-tejas-son

chitram-1-1-with-tejas-son

ఇక స్టార్ హీరోలు మహేష్ బాబు, రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రాం లతో కూడా తేజ సినిమాలు తీసి హిట్ కొట్టాడు. కాగా గత ఏడాది తేజ గోపీచంద్ తో అలివేలు మంగ వెంకటరమణ, అలాగే రానాతో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ గోపీచంద్ సినిమాకి హీరోయిన్ దొరకక ప్రాజెక్ట్ పెండింగ్ పడిందన్నారు. ఈ క్రమంలో సడన్‌గా చిత్రం సినిమా సీక్వెల్ తీస్తున్నట్టు తేజ ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్ లోగో కూడా వదిలారు. చిత్రం 1.1 పేరుతో తెరకెక్కనున్న సినిమాలో దగ్గుబాటి హీరో పరిచయం అవుతున్నాడని వార్తలు వచ్చాయి.

Teja : అమితోవ్ తేజ్ నే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎం.టి.ఆర్ బావమరిది నితిన్ చంద్ర హీరోగా పరిచయం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఇదే వార్త అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కన్‌ఫ్యూజన్ కూడా నెలకొంది. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యేది దగ్గుబాటి అభిరాం ఆ లేక ఎన్.టి.ఆర్ బావమరిదా అని. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రం 1.1 తో తేజ తన కొడుకు అమితోవ్ తేజ్ నే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. తేజ కొడుకు ఇప్పటికే రెండు మూడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవమన్నది త్వరలో అఫీషియల్ న్యూస్ రానుంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp