
clarity on Prabhas salaar Movie release date
Salaar Movie : ఇటీవల రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట.
సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కేజీయఫ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో సెంటిమెంట్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ.. ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన లుక్ పోస్టర్ ఇప్పటికీ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి హోంబాలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారాయి.
clarity on Prabhas salaar Movie release date
సలార్ సినిమా 30 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. మిగతా షూటింగ్ ని మే లో మొదలుకానుంది. ఇక ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ ని పూర్తిచేసి, 2023 ఏప్రిల్ కానీ, జూన్ లో కానీ సినిమాను రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. అంటే వచ్చే ఏడాదికి కాని సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు 30 శాతం మాత్రమే పూర్తిచేసింది అంటే.. ప్రశాంత్ నీల్ ఎంత పర్ఫెక్ట్ గా సినిమాను చెక్కుతున్నాడో అర్ధం అవుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు. హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.