
BP Normal Sugar Control in Health Benefits of Radish
Health Benefits : ముల్లంగి ఆరోగ్యకరమైన ఫుడ్ లో ఒకటి. ఇది తక్కువ కేలరీలు కలిగిన రూట్ వెజిటేబుల్స్ పోషకాలతో నిండి ఉంటుంది. ఉత్తరాది ప్రజలైతే ముల్లంగిని అత్యంత ఇష్టంగా తింటారు. ముల్లంగి సలాడ్లు విపరీతంగా లాగించే నార్త్ ఇండియన్స్ కు మూలీ పరోఠా అత్యంత ఇష్టమైన ఆహారం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ముల్లంగితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అయితే సాంప్రదాయ వైద్యంలో ముల్లంగిని ఎక్కువగా ఉపయోగిస్తారు. సాంప్రదాయ చైనీస్ వైద్యంలో జర్వం, గొంతు నొప్పి, మంట వంటి సమస్యలకు చికిత్స చేయడంలో ముల్లంగిని వాడతారు.ముల్లంగిలోని పోషకాలు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ముల్లంగిలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, బి6, పొటాషియం ఇతర మినరల్స్ ఇందులో ఉంటాయి.
విటమిన్ సీ యాంటిఆక్సిడెంట్ ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడడంలో సహాయపడుతుంది. అలాగే వృద్దాప్యం, అన్ హెల్తీ లైఫ్ స్టైల్, పర్యావరణ విషపదార్థాల వల్ల కలిగే కణాల నష్టాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలను, చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.ముల్లంగి వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఐసోథియోసైనేట్ లు క్యాన్సర్ కు కారణమయ్యే కణతిల అభివృద్దిని నిరోధిస్తాయి. ముల్లంగి రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్ట్స్ చెబుతున్నారు.ముల్లంగి వల్ల చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి లభిస్తాయి. లివర్ సంభందిత వ్యాధులను నియంత్రిస్తుంది. ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది.
BP Normal Sugar Control in Health Benefits of Radish
కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనాన్ని చేకూస్తుంది.ముల్లంగిని డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల సరిపడా ఫైబర్ అందుతుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. బీపీ అండ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే అధిక బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ కణజాలాన్ని రక్షిస్తూ.. శ్లేష్మ అవరోధాన్ని బలోపేతం చేసి గ్యాస్ట్రిక్ అల్సర్ ని నివారిస్తుంది.ముల్లంగిని తరచు ఆహారంలో చేర్చుకోవడం వల్ల దురద వంటి కొన్ని చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాదు ముల్లంగి లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. దీనితో ఇది బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ముల్లంగి ఒక సహజ యాంటీ ఫంగల్. కాండిడా అల్బికాన్స్ అధికంగా పెరిగినపుడు యోని ఈస్ట్ ఇన్పెక్షన్లు, నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లను ముల్లంగిలో ఉన్న యాంటి ఫంగల్ నివారిస్తుంది.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.