Home » Entertainment » Comedian Ali About On Pawan Kalyan
Entertainment

Pawan Kalyan – Ali : పవన్ కళ్యాణ్ ఆలీ కూతురు పెళ్లికి ఈ కారణంగానే రాలేదు… అసలు నిజం బయటపెట్టిన ఆలీ…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 2, 2022, 1:00 pm
Advertisement

Pawan Kalyan – Ali : ఇటీవల ఆస్య నటుడు ఆలీ కూతురు పెళ్లి నవంబర్ 27న హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు సినీ తారలు మరియు రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ తారలు కూడా హాజరై వధూవరులను దీవించారు. అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే పవన్ కళ్యాణ్ మరియు ఆలీ మంచి స్నేహితులన్న విషయం మనకు తెలిసిందే. దాదాపుగా పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో ఆలీ పాత్ర కచ్చితంగా ఉంటుందని చెప్పాలి.

Advertisement

అలీ లేకుండా పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి స్నేహితుడు కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ఆలీ వైసిపి పార్టీకి మద్దతి ఇచ్చిన సంగతి మానకు తెలిసిందే. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత ఆలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారునిగా నియమించింది. ఇక ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ మరియు ఆలీకు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.

comedian Ali about on Pawan Kalyan

Advertisement

పవన్ కళ్యాణ్ , ఆలీ కూతురు పెళ్లికి రాకపోవడానికి కూడా ఇదే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కోడుతుంది. అయితే రీసెంట్గా ఈ విషయంపై ఆలీ స్పందించారు. టీవీ9తో ప్రత్యక్షంగాా మాట్లాడిన ఆలీ పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి రాకపోవడానికి గల కారణం పై క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయంపై మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు చిత్త బృందం అందరికీ శుభలేఖ ఇచ్చానని, పవన్ కళ్యాణ్ కూడా వివాహానికి వస్తానని చెప్పారని, కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆయన రాలేకపోయారని తెలియజేశారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారాని, తర్వాత తానే నేరుగా వచ్చి కలుస్తానని చెప్పారు… అనే విషయాన్ని తెలియజేశారు .

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి