Rahul Ramakrishna : తండ్రి కాబోతున్న కమెడియన్.. పెళ్లి కాకుండానే తండ్రి ఏంటి బాసు.. ఆడియన్స్ షాక్..!

Authored By aruna | The Telugu News | Published on: November 7, 2022, 5:00 pm

Rahul Ramakrishna : టాలీవుడ్ Tollywood కమెడియన్స్ లో ఈమధ్య వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు రాహుల్ రామకృష్ణ Rahul Ramakrishna. తెలంగాణ Telangana కుర్రాడిగా అదే యాసతో అతను మాట్లాడే భాష.. చేసే కామెడీ అందరిని అలరిస్తాయి. ఇక అర్జున్ రెడ్డిలో హీరో ఫ్రెండ్ పాత్రలో అదరగొట్టాడు రాహుల్ రామకృష్ణ. ఆ సినిమాతో అతనికి సూపర్ క్రేజ్ ఏర్పడటంతో పాటుగా వరుస అవకాశాలు వస్తున్నాయి. స్టార్ సినిమాల్లో కూడా రాహుల్ నటిస్తూ వస్తున్నాడు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా తన ట్విట్టర్ లో పెట్టిన ఓ కామెంట్ అతన్ని ఇరుకున పడేసింది. త్వరలో తండ్రి కాబోతున్నా అంటూ ఓ పిక్ షేర్ చేశాడు రాహుల్ల్. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. ఈ ఇయర్ మొదట్లో తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటున్నా అంటూ ప్రకటించాడు రాహుల్. అయితే పెళ్లి మాత్రం ఎప్పుడు చేసుకున్నాడో రివీల్ చేయలేదు. కానీ సడెన్ గా ఇప్పుడు తన భార్య ఫోటోని షేర్ చేసి త్వరలో తండ్రి కాబోతున్నా లిటిల్ వన్ కమింగ్ అంటూ షాక్ ఇచ్చాడు.

comedian rahul ramakrishna announced his wife pragnancy

comedian rahul ramakrishna announced his wife pragnancy

రాహుల్ చెప్పిన ఈ విషయానికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పే చేసుకోవచ్చు కదా అని కొందరు ఇప్పటికే అతనిపై కామెంట్స్ విసురుతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp