Comedian Saddam : సద్దాం టీంలోంచి బయటకు వెళ్లిన రియాజ్.. బాధపడ్డ కమెడియన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Comedian Saddam : సద్దాం టీంలోంచి బయటకు వెళ్లిన రియాజ్.. బాధపడ్డ కమెడియన్

Comedian Saddam : బుల్లితెరపై తారాజువ్వాల ఎదిగిన కమెడియన్ సద్దాం. పటాస్ షోలో ఈ సద్దాం బ్యాచ్ అంతా కూడా ఫేమస్ అయింది. యాదమ్మ రాజు కూడా అక్కడి నుంచే వచ్చాడు. గల్లీ బాయ్స్ రియాజ్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఇలాంటి వారంతా కూడా మెల్లిగా జీ తెలుగుకు వచ్చారు. నాగబాబు సపోర్ట్‌తో అదిరింది, బొమ్మ అదిరింది షోలో సందడి చేశారు. అయితే కాస్త హద్దులు దాటడం, వైఎస్ జగన్ మీదే సెటైర్లు వేయడంతో […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 August 2022,3:40 pm

Comedian Saddam : బుల్లితెరపై తారాజువ్వాల ఎదిగిన కమెడియన్ సద్దాం. పటాస్ షోలో ఈ సద్దాం బ్యాచ్ అంతా కూడా ఫేమస్ అయింది. యాదమ్మ రాజు కూడా అక్కడి నుంచే వచ్చాడు. గల్లీ బాయ్స్ రియాజ్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఇలాంటి వారంతా కూడా మెల్లిగా జీ తెలుగుకు వచ్చారు. నాగబాబు సపోర్ట్‌తో అదిరింది, బొమ్మ అదిరింది షోలో సందడి చేశారు. అయితే కాస్త హద్దులు దాటడం, వైఎస్ జగన్ మీదే సెటైర్లు వేయడంతో ఆ షో మూతపడింది.

ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తోంది.అయితే తాజాగా సద్దాం ఓ విషయంలో తెగ బాధపడ్డాడు. ఆ విషయాన్ని తెలివిగా తన స్కిట్లో ఇరికించేశాడు. పుష్ప స్పూప్‌ను సద్దాం వేశాడు. అందులో పుష్పగా సద్దాం, షెకావత్‌గా రియాజ్ నటించాడు. తన టీంను వదిలి.. వేరే టీంలోకి వెళ్లారు సర్.. మీరు నన్ను హర్ట్ చేశారు సర్ అంటూ పుష్ప మ్యానిరిజంలో చెప్పేశాడు సద్దాం.

Comedian Riyaz Out Of Comedian Saddam Team

Comedian Riyaz Out Of Comedian Saddam Team

Comedian Saddam : బాధపడ్డ సద్దాం

నేను నిన్ను పైకి తెచ్చాను.. నా టీంలో పెట్టుకున్నాను.. ఆఫర్లు ఇచ్చాను.. ఇన్ని చేస్తే.. నువ్ పక్క టీంలోకి వెళ్తావా.. అవినాష్ టీంలోకి వెళ్లావ్.. హరిగాడి టీంలోకి వెళ్లావ్.. నేను రెండు నెలలు ఇంట్లో కూర్చుని బాధపడ్డాను.. అది మీకు తెలుసా.. అంటూ షెకావత్ పుష్ప సీన్‌ను రిపీట్ చేశాడు. మొత్తానికి రియాజ్ వెళ్లిపోవడంతో సద్దాం గ్రాఫ్ పడిపోయిందని అర్థమవుతోంది. అందుకే ఇలా మళ్లీ రియాజ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సద్దాం తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయటపెట్టేసినట్టు కనిపిస్తోంది. రియాజ్ ఈ మధ్యే తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. స్టేజ్ మీదే తన భార్యతో రొమాన్స్ చేసేశాడు రియాజ్.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది