Comedian Subhashini Emotional Anchor SUma In Cash SHow
Anchor Suma : యాంకర్ సుమ బుల్లితెరపై ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. క్షణం తీరిక లేకుండా షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ తిరిగేస్తోంది. ఇక ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ కూడా బాగానే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో వైపు కొడుకు రోషన్‌ని కూడా సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇప్పించేస్తోంది. అలా సుమ ఎంత బిజీగా ఉన్నా కూడా తన అభిమానులను మరిచిపోదు. సోషల్ మీడియా ద్వారా సుమ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఇక సుమ గురించి ఇదంతా ఒక కోణమే. సుమ గురించి ఎవ్వరికీ తెలియని మరో కోణం ఉంది. సుమ ఎంత కమర్షియలో అందరికీ తెలిసిందే. తన టైం అంటే టైమే. తను చెప్పిన టైంకే వస్తుంది..
వెళ్తుంది. అడిగినంత ఇవ్వాల్సిందే. అలా సుమ చేసే ప్రోగ్రాంలైనా సరే, ఈవెంట్లైనా సరే ఆమెదే పై చేయి అవుతుంది. అంతలా సుమకు డిమాండ్ ఉంది. సుమ ఉందంటే ఏ ఈవెంట్ అయినా, షో అయినా సరే బోర్ కొట్టనివ్వదు. అయితే సుమ ఇంతలా సంపాదిస్తోంది కదా? ఆమె ఏమైనా సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేస్తుందా? అనే అనుమానం వచ్చి ఉంటుంది. తాజాగా సుమ గొప్ప మనసు గురించి అందరికీ అర్థమైంది. సుమ హోస్ట్‌గా వస్తున్న క్యాష్ షో ప్రోమో తాజాగా యూట్యూబ్‌లోకి వచ్చింది. ఇందులో ఓల్డ్ కమెడియన్స్ అంతా వచ్చారు. అల్లరి ఫేమ్ సుభాషిణి, జెన్నీ, కృష్ణవేణి, బాలాజీ వంటి వారు వచ్చారు.
Comedian Subhashini Emotional Anchor SUma In Cash SHow
ఇక వీరందరితో కలిసి సుమ ఫన్ చేసింది. వారందరి మీద సెటైర్లు వేసింది. అయితే ప్రోమో చివర్లో మాత్రం సుభాషిణి చెప్పిన మాటలు విని అందరినీ కన్నీరు పెట్టించేసింది. తాను ఈ రోజు ఇలా ఇక్కడ ఉండగలిగాను.. ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం సుమ అని చెప్పుకొచ్చింది. ఆరు నెలలకొకసారి మందులు పంపిస్తుందని, ఆమె వల్లే బతికి ఉన్నాను అని, సుమ బంగారు తల్లి.. వచ్చే జన్మంటూ ఉంటే.. నువ్ నా కడుపులో పుట్టాలి అంటూ సుమ గురించి చెబుతూ సుభాషిణి ఎమోషనల్ అయింది. ఇక సుమ సైతం సుభాషిణిని హత్తుకుని ఎమోషనల్ అయింది.
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
This website uses cookies.