Comedian Yadamma Raju : కమెడియన్ యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్ వీడియో … ఫొటోస్ వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: November 29, 2022, 10:20 am

Comedian Yadamma Raju : టెలివిజన్ రంగంలో జబర్దస్త్, పటాస్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కామెడీ షోల ద్వారా గుర్తింపు సంపాదించిన వారిలో యాదమ్మ రాజు ఒకరు. ఈ కామెడీ షోల ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగానికి చాలామంది పరిచయమయ్యారు. హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, చలాకీ చంటి ఇంక చాలామంది ఈ కామెడీ షోల ద్వారా తమకంటూ గుర్తింపు దక్కించుకొని ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు. వీళ్ళ మాదిరిగానే యాదమ్మ రాజు.. పటాస్ షోలో స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక జోక్ వేసి.. ఆన్లైన్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించాడు.

యాదమ్మ రాజు వేసే జోకులు ఆ కొట్టుకునే రీతిలో ఉండటంతో పాటు టైమింగ్ కూడా జనాలకి నచ్చడంతో అవకాశాలు లభించాయి. దీంతో వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకున్న యాదమ్మ… టెలివిజన్ రంగంలో మంచి ఫేమస్ అయ్యాడు. యాదమ్మ రాజ్ కి స్టెలా రాజ్ అనే గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటినుండో వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. కలసి కొన్ని షోలలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్” షోలో… రాణిస్తున్న యాదమ్మ లేటెస్ట్ గా నిశ్చితార్థం కూడా చేసుకోవడం జరిగింది. తాను ప్రేమించిన స్టెల్లా రాజ్ నీ.. యాదమ్మ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comedian Yadamma Raju engagement photos on video

Comedian Yadamma Raju engagement photos on video

ఇక స్టేల్లా రాజ్ కూడా తనకంటూ సెపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రాణిస్తోంది. దానిలో యాదమ్మ రాజుతో కలిసి కూడా కామెడీ వీడియోలు చేయడం జరిగింది. ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ త్వరలో.. పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. గతంలో అనేక కామెడీ షోలలో యాదమ్మ రాజు చేసిన కామెడీ.. ఒక ఎత్తు అయితే ఇప్పుడు సద్దాం తో చేస్తున్న ఫన్నీ స్కిట్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సద్దాం యాదమ్మ స్టేజ్ ఎక్కుతున్నారంటే.. కామెడీ ఆడియన్స్ ఆత్రుతగా స్కిట్ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. కాగా యాదమ్మ రాజు స్టెల్లా.. నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp