comedy punch on sridevi drama company show in star maa comedy stars
Sridevi Drama Company : ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి పోటీ అన్నట్లుగా జీ తెలుగు మరియు స్టార్ మా చానల్స్ ఇప్పటికే పలు కార్యక్రమాలను తీసుకు వచ్చి విఫలమయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ స్థాయిని అందుకోవడం ఏ ఒక్కరి తరం కావడం లేదు. జబర్దస్త్ ని కేవలం జబర్దస్త్ మాత్రమే బీట్ చేయగలదు అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. స్టార్ మా లో ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
మొత్తం జబర్దస్త్ వాళ్ళు వెళ్లి అక్కడ కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి కామెడీ అయితే బాగానే ఉంది కానీ జబర్దస్త్ రేంజిలో షో దూసుకు వెళ్లలేక పోతుంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సమయంలోనే కామెడీ స్టార్స్ తాజా ఎపిసోడ్ లో ఒక స్కిట్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన కాన్సెప్ట్ ను విమర్శిస్తూ కామెడీ చేసే ప్రయత్నం చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో శ్రీమంతం కార్యక్రమాలు.. ఓనీల కార్యక్రమాలు ఇంకా షష్టి పూర్తి కార్యక్రమాలతో పాటు రకరకాల కార్యక్రమాలు చేస్తారు అంటూ కామెడీ చేశారు. ఈ విషయంపై శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి.
comedy punch on sridevi drama company show in star maa comedy stars
ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఏమాత్రం సరి కాదు.. అది ఏ ఒక్కరూ అంగీకరించరు. ఎవరి కామెడీ షో వారు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తప్పితే ఒకరిపై ఒకరు ఇలా వ్యంగ్య ప్రచారం చేస్తూ తక్కువ చేస్తూ మాట్లాడుకోవడం సరి కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం కామెడీ లో భాగంగా ఇదంతా చేశారు. దాంట్లో ఎలాంటి తప్పులేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కమెడియన్స్ వారి పై వారు పంచ్ లు వేసుకుని నవ్విస్తున్నారు. అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి కామెడీ చేసినంత మాత్రాన తప్పేం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని కామెంట్ చేయడం తో కచ్చితంగా ఈటీవీలో జబర్దస్త్ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ లో స్టార్ మా కామెడీ షో కు సంబంధించిన కౌంటర్ గట్టిగానే పడే అవకాశం ఉందంటున్నారు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.