Home » Entertainment » Vijayendra Prasad Reveals The Secrets Of Rrr Movie
Entertainment

RRR Movie : ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాకుండా ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Updated on: March 24, 2022 6:31 pm
Advertisement

RRR Movie  : మార్చి 25న విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్‌కి 24 గంట‌లు స‌మ‌యం ఉండ‌గా, సంద‌డి అప్పుడే మొద‌లైంది. ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడాలి అని కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది కోసం చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా స్పెషల్ షో లు కూడా వేసినట్లుగా తెలుస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం జోరుగా ప్ర‌చారం నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇన్నాళ్లు ఏం మాట్లాడ‌ని విజయేంద్ర ప్ర‌సాద్ తాజాగా ప‌లు విష‌యాల గురించి వెల్లడించారు.

Advertisement

ఆర్ఆర్ఆర్ ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఎవరికీ తెలియని సీక్రెట్స్ రివీల్ చేశారు. రాజమౌళి మొదట మల్టీ స్టారర్ తీయాలని అనుకున్నారని, అయితే మొదట ఎవరినీ పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేశారట. ఆ తర్వాత కొన్ని రోజులకు రజనీకాంత్-అర్జున్, సూర్య-కార్తీ వంటి స్టార్స్‌తో పాటు మరికొన్ని కాంబినేషన్‌లు అనుకున్నారు. అయితే సహజంగానే స్నేహంగా ఉండే స్టార్స్, రెండేళ్లపాటు ఒకరితో ఒకరు కలిసి ఉండే ఇద్దరు హీరోలు కావాలి.

vijayendra prasad reveals the secrets of RRR Movie

Advertisement

RRR Movie  : అస‌లు ఎవ‌రిని అనుకున్నారు..

రియ‌ల్ లైఫ్‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ చాలా సాన్నిహిత్యంగా ఉంటారు కాబ‌ట్టి వారిద్ద‌రు అయితే బాగుంటుందని భావించిన రాజ‌మౌళి వెంట‌నే వీరిద్ద‌రితో ఆర్ఆర్ఆర్ సినిమా ప్లాన్ చేశాడు. ఇదే విష‌యాన్ని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇంకేముంది చెర్రీ, తారక్ ల వల్ల ఆ స్టార్ హీరోలు ‘ఆర్ఆర్ఆర్’ను మిస్సయ్యారు. ఈ ఇద్ద‌రు హీరోల ప్లేస్ లో వేరే హీరోలు వ‌చ్చిన అంత కిక్ ఉండ‌ద‌నేది స‌గ‌టు ప్రేక్ష‌కుడి అభిప్రాయంగా క‌నిపిస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌గా, ఈ సినిమా 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని స‌మాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి