Rajamouli : రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు..!
ప్రధానాంశాలు:
Rajamouli : రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు..!
Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి Rajamouliపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని చెప్పిన శ్రీనివాసరావు ..ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పారు.

Rajamouli : రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు..!
Rajamouli రాజమౌళి అలాంటోడా..
ఈ విషయాలను ఎవరికో చెప్పాననే అనుమానంతో తనను వేధించడం మొదలు పెట్టాడని శ్రీనివాసరావు Srinivasa rao తెలిపారు. రాజమౌళి టార్చర్ ను 54 ఏళ్ల వయసులో తాను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసని… ఆయనకు పోటీగా ఉన్న డైరెక్టర్లు అందరినీ తొక్కేశాడని, ఇప్పుడు మరికొందరు దర్శకులను టార్గెట్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో పాటు ఒక లేఖను కూడా విడుదల చేశారు. రాజమౌళి డైరెక్టర్ గా ఎదగడానికి తన జీవితం మొత్తం ధార పోశానని చెప్పారు. ఆయన కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ Batchelor గానే మిగిలిపోయానన్నారు. రాజమౌళి వల్లే నా జీవితం నాశనం అయ్యిందని కూడా ఆయన అన్నారు.