Home » Entertainment » Controversy Comments On Srihari Wife
Entertainment

Sri Hari : నీ భార్య ఐటెం గార్ల్ అంటూ శ్రీహ‌రిని ఆ స్టార్ హీరో అన్ని మాట‌లు అన్నాడా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 2, 2022, 11:00 am
Advertisement

Sri Hari : శ్రీహ‌రి.. స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గాను, హీరోగాను ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు శ్రీహ‌రి. తన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలు, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏది దొరికితే అది చేసుకుంటూ తన టాలెంట్ ను బయటపెట్టారు. ఆ తర్వాత హీరోగా చేసి అగ్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లో నటన చూస్తే ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాల్సిందే. ఈ విధంగా చాలా సినిమాల్లో హీరోగా నటించి చరిత్రలో గొప్ప నటుడిగా మిగిలిపోయారని చెప్పవచ్చు.

Advertisement

Sri Hari : దారుణ‌మైన కామెంట్స్..

నిజం చెప్పాలంటే శ్రీహరి లాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ని కోల్పోవడం టాలీవుడ్ చేసుకున్న బిగ్గెస్ట్ పాపం. శ్రీహరి లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. డబ్బు ఆశ లేకుండా నటనపై ఇంట్రెస్ట్ తో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి నటించే వాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిలో ఒకరే ఈ శ్రీహరి . రీల్ లైఫ్ లో ఎంత సీరియస్ గా ఉంటారో.. రియల్ లైఫ్ లో అంత సరదాగా ఉంటారు. ఆయన ఐటమ్ గర్ల్ గా సినిమాలో పాటలు చేసిన డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పెళ్లి చేసుకునే టైంలో చాలామంది ఆయనను నీ భార్య ఓ ఐటమ్ గర్ల్ అంటూ వెక్కిరించారట. ఓ స్టార్ హీరో కూడా శ్రీహ‌రి భార్య‌పై దారుణంగా మాట్లాడాడ‌ట‌.

A Hero Comments On Sri Hari Wife

Advertisement

శ్రీహరి మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తన భార్యను తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నారట. పెళ్లి తర్వాత తన భర్త పరువు ప్రతిష్టలను కాపాడుతూ భర్త అడుగుజాడల్లోనే నడుచుకుంటూ శ్రీహరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆమెని ఐటెం గర్ల్ అంటూ ఇప్పటికీ పిలుస్తున్నారు. అయితే భర్త మరణం తర్వాత శ్రీహరి భార్య డిస్కో శాంతి ..సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది . బిడ్డలను చూసుకుంటూ తన ప్రాణాలను వాళ్లపైనే పెట్టుకొని బ్రతుకుతుంది. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి ఈ 1996లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఆమెను పెళ్లి చేసుకున్న సమయానికి ఆమె ఐటమ్ సాంగ్స్ లో ఫుల్ క్రేజ్ లో ఉంది.కాగా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి