Prabhas : “ఒరేయ్ బాబు ఆ సినిమా మాకు వద్దు రా ఆపేయండి ” ప్రభాస్ ఫ్యాన్స్ గోల గోల…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : “ఒరేయ్ బాబు ఆ సినిమా మాకు వద్దు రా ఆపేయండి ” ప్రభాస్ ఫ్యాన్స్ గోల గోల…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :28 December 2022,3:20 pm

Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. దీంతో ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయంలో కానీ కొత్తగా ఓకే చేస్తున్న ప్రాజెక్టు విషయంలో కానీ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ రాజా డీలక్స్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో అభిమానులు ఒక్కసారి షాక్ అయ్యారు.

వరుస ఫ్లాపులతో ఉన్న మారుతి తో సినిమా అసలు చేయొద్దు అంటూ ఫ్యాన్స్ గోల గోల చేశారు. ప్రభాస్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో మారుతినీ టార్గెట్ చేస్తూ ప్రభాస్ తో ఆ సినిమా అస్సలు చేయొద్దు అంటే విమర్శలు గుప్పించారు. ప్రభాస్ మారుతి సైలెంట్ గా రాజా డీలక్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. షూటింగ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ లోకేషన్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్ లో లీక్ అయింది. సెట్ లో ప్రభాస్ చైర్ లో కూర్చుని వుండగా పక్కనే

crazy rumour about Prabhas Raja deluxe movie

crazy rumour about Prabhas Raja deluxe movie

మారుతి మాట్లాడుతూ కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి సినిమా బృందంలోని వారే ఈ ఫోటో ని పెట్టారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా అనుకున్న విధంగా వస్తే రిలీజ్ చేద్దామని రాకపోతే స్క్రాప్ చేద్దామని ప్రభాస్ భావించాడని క్రేజి రూమర్ వచ్చింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని రాజా డీలక్స్ సినిమా అనుకున్న దానికంటే ఎక్సలెంట్ గా వస్తుందని మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారను కూడా టాక్ వస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది