
Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ కాంబో మూవీపై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..!
Allu Arjun : పుష్ప సినిమా Pushpa Movie తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీని సుకుమార్ Sukumar భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధమవుతుంది.ఈ మూవీపై తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీ రేంజ్‌లో ఉన్నాయి. గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ ఓ రేంజ్‌లో రెస్సాన్స్ దక్కించుకుంది. ఇందులో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషించడంతో మూవీపై అంచనాలు పీక్స్‌కి వెళ్లాయి. సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్ బయటకు వచ్చిన కూడా అది నెట్టింట వైరల్‌గా మారుతుంది.
ఇక పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో మూవీ చేస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నట్టు ప్రచారం జరిగింది. గతేడాది ‘జవాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అట్లీ ఇప్పటికే బన్నీకి ఓ కథ వినిపించాడని, అది నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయ సమాచారం. రీసెంట్‌గా అట్లీ తన అసిస్టెంట్ దర్శకులతో స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8న కావడంతో ఆ రోజు చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటుందనే టాక్ నడుస్తుంది. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని భారీ ఎత్తున నిర్మించనున్నారని సమాచారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలించినట్టు వార్తలు వినిపించాయి. కాని అవన్నీ కూడా అవాస్తవం అని కొట్టి పడేశారు. దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత పూజా హెగ్డే- అల్లు అర్జున్ కలిసి పని చేయబోతున్నారని అభిమానులు భావించినప్పటికీ అదంతా పుకారుగానే మిగిలింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
This website uses cookies.