Home » News » Railway Recruitment Board Latest Job Notification 2024
News

Railway Recruitment : ఏడేళ్ల తర్వాత రైల్వేలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్… 4000 పోస్టుల భర్తీ…!

Authored By
Ramu
The Telugu News | Published on: March 17, 2024, 8:00 am
Advertisement

Railway Recruitment : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ( RRB ) నుండి తాజాగా 4,660 సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తిగా వివరాలు ఈ కథనం చదివి తెలుసుకోండి.

Advertisement

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,660 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పోస్ట్ లు ఉన్నాయి.

Advertisement

వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయస్సు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 10th /any Degree విద్యార్హత కలిగి ఉండాలి.

Advertisement

జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 45 వేల రూపాయలు జీతం గా ఇవ్వబడుతుంది.

రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి SC,STలకు ఎలాంటి ఫీజు ఉండదు. కావున వెంటనే అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారు ఏప్రిల్ 15 నుండి మే 14 వరకు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ముందుగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా సంబంధిత ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహిస్తారు.ఇక ఈ రాత పరీక్షలు ఉత్తీర్ణులు అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Advertisement

ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్న వారు సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి