Balakrishna Dabidi Dibidi Song : డాకు మహారాజ్ సాంగ్.. ఈ ట్రోల్స్ అస్సలు ఊహించలేదే…!
ప్రధానాంశాలు:
Balakrishna Dabidi Dibidi Song : డాకు మహారాజ్ సాంగ్.. ఈ ట్రోల్స్ అస్సలు ఊహించలేదే..!
Balakrishna Dabidi Dibidi Song : నందమూరి బాలకృష్ణ Balakrishna ఓ పక్క పొలిటికల్ గా తన దూకుడు చూపిస్తూనే హీరోగా వరుస విజయాలతో అదరగొట్టేస్తున్నాడు. ప్రతుతం బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్, Urwasi Rautela ఊర్వశి రౌతెలా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా థర్డ్ సాంగ్ కూడా రీసెంట్ గా రిలీజైంది.
డాకు మహారాజ్ Daaku Maharaaj , నుంచి మూడో సాంగ్ గా దబిడి దిబిడి అంటూ వచ్చేసింది. ఈ సాంగ్ ని శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఐతే ఈ కంపోజింగ్ లో ఒక స్టెప్ చాలా అసభ్యకరంగా ఉంది. ఊర్వశి రౌతెలా తో బాలయ్య డ్యాన్స్ చేస్తూ ఆమె బెండ్ అయితే అలా ఆమెను కొడుతూ ఉంటాడు. ఐతే ఈ స్టెప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.
Balakrishna Dabidi Dibidi Song ఈమధ్య రొటీన్ స్టెప్స్..
ఓ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలా బాలకృష్ణ ఇలా ఎలా చేస్తారని అంటున్నారు యాంటీ ఫ్యాన్స్. అంతేకాదు ఈ సాంగ్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కి డ్యాన్స్ లో గుజ్జు అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ కి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ఈమధ్య రొటీన్ స్టెప్స్ ఇస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో ఈ Dabidi Dibidi సాంగ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నా సరే సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ కూడా ఇదే దొరికింది ఛాన్స్ అన్నట్టుగా ఆ సాంగ్ ని మరింత ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ పై వస్తున్న ఈ ట్రోల్స్ కి చిత్ర యూనిట్ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. Balakrishna, Daku Maharaj, Dabidi Dibidi Song, Thaman,
Bro this #Balakrishna is a comedy action star 🤣🤣#Tollywood https://t.co/ZQRDsp8Kr9
— Cezane Syed (@Cezane100322) January 3, 2025