Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నిజంగా బీభత్సమైన ట్విస్ట్ ను తీసుకొచ్చింది. నిన్నటి వరకు మోనిత.. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా బిడ్డను కంటోందని అనుకున్నారు. కార్తీక్ శాంపిల్స్ తీసుకొని తన గర్భంలో ప్రవేశపెట్టుకున్నదని.. తను చీటర్ అని అంతా అనుకున్నారు. కార్తీక్ తనను ముట్టుకోలేదని.. అదంతా తన ప్లాన్ అని అందరూ నమ్మడంతో కార్తీక్ జైలు నుంచి విడుదలయ్యాడు. అందరూ కార్తీక్ ను నిర్దోషిగా.. మోనితను దోషిగా చూశారు.
కానీ… తనకు పురిటినొప్పులు ప్రారంభం కాగానే.. మోనిత ఇక ఆగలేకపోయింది. తన కడుపులో పుడుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే అని సంతకం పెట్టాలని.. అలా అయితేనే ఆపరేషన్ చేయించుకుంటా అని మొండి పట్టు పట్టింది. అలాగే.. కార్తీక్ కు అసలు నిజం కూడా చెప్పేసింది. మనిద్దరం కలిస్తేనే.. నేను నీతో పడుకుంటేనే నాకు ఈ గర్భం వచ్చింది. ఇది సహజంగా వచ్చిన గర్భం. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా వచ్చిన గర్భం కాదు.. అని మోనిత అసలు నిజం చెప్పడంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.
ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది మోనిత గురించో.. మోనితకు పుట్టిన మగ బిడ్డ గురించో లేక సౌందర్య గురించో.. కార్తీక్ గురించో కాదు.. దీప గురించి.. దీప జీవితం గురించి.. ఎందుకంటే.. మోనితను తన భార్యగా.. మోనిత కొడుకును తన కొడుకుగా కార్తీక్ అంగీకరిస్తూ సంతకం పెట్టాడు. దీంతో దీపను అడ్డంగా కార్తీక్ మోసం చేసినట్టే.ఆ విషయం ఇవాళ్టి ఎపిసోడ్ తో తెలిసిపోయింది. మోనితకు కొడుకు పుట్టాడనే విషయం దీప ప్రియమణి ద్వారా తెలుసుకుంది. ఇంటికి వచ్చాక కూడా సౌందర్య, కార్తీక్ కనీసం మోనిత విషయం ఎత్తరు. గుడికి వెళ్లి వస్తున్నామంటూ అబద్ధం చెబుతారు. దీంతో దీపకు మరింత కోపం వస్తుంది.
ఈనేపథ్యంలో దీప.. ఇక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకుండా.. వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీపకు కనీసం మోనిత విషయం కూడా సౌందర్య, కార్తీక్ చెప్పకపోవడంతో.. కార్తీక్, సౌందర్యను ఈ విషయంపై నిలదీసి.. తన పిల్లలను తీసుకొని వచ్చే ఎపిసోడ్ లో దీప తిరిగి బస్తీకి వెళ్లిపోతుందని తెలుస్తోంది.ఒకవేళ దీప బస్తీకి వెళ్లిపోతే… కార్తీక్, సౌందర్య మోనితను తమ ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తమకు వారసుడు పుట్టడంతో మోనిత కొడుకును తమ వారసుడిగా స్వీకరించే అవకాశం ఉంది. చూద్దాం మరి.. తరువాయిభాగం శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో?
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.