Home » Entertainment » Deepa Re Entery Into Kartika Deepam
Entertainment

Karthika Deepam : స‌ర్‌ప్రైజ్‌.. కార్తీక‌దీపంలోకి రీ ఎంట్రీ ఇస్తున్న వంటలక్క..!

Authored By
aruna
The Telugu News | Published on: August 11, 2022, 2:40 pm
Advertisement

Karthika Deepam : బుల్లితెర అభిమానులకు కార్తీక దీపం సీరియల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఈ సీరియల్‌కు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది అభిమానులు ఉన్నారు. సీరియల్ వస్తుందని తెలిస్తే చాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరి చూసేవారు ఉన్నారు. ఆ రేంజ్‌లో దీనికి ఫాలోవర్స్ ఉన్నారు. కార్తీక దీపం సీరియల్‌ను కేవలం సామాన్య ప్రేక్షకులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా వీక్షించేవారంటే అతిశయోక్తి కాదు. కార్తీకదీపం సీరియల్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు వంటలక్క,డాక్టర్ బాబు.వీరిద్దరి పాత్రల వల్లే సీరియల్ టీఆర్పి రేటింగ్‌లోనూ దూసుకుపోయింది.

Advertisement

వంటలక్క రోల్ చేసిన ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ పరిటాలకు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదంతా కార్తీక దీపం వల్లే వచ్చిందంటే నమ్ముతారా? కానీ ఇదే నిజం.ఈ సీరియల్ వలన వారిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.వంటలక్క క్యారెక్టర్ చాలా బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ఈ పేరుమీద కొత్తగా వేరే సీరియల్ కూడా ప్రారంభమైందంటే అర్థం చేసుకోవచ్చు కార్తీకదీపం సీరియల్ పవర్.. వంటలక్క రోల్ చేసిన నటి అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.కేరళకు చెందిన ఈ నటి కార్తీకదీపం సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. సీరియల్‌లో డాక్టర్ బాబు,వంటలక్క క్యారెక్టర్ను చంపేయడంతో అభిమానులు నిరాశకు గురైన విషయం తెలిసిందే.

Deepa re-entery into Karthika Deepam

Advertisement

Karthika Deepam : వంటలక్క రీఎంట్రీ రంగం సిద్ధం

దీప క్యారెక్టర్‌ను ఎప్పుడైతే చంపేశారో అప్పటి నుంచి సీరియల్ రేటింగ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. చాలా మంది సీరియల్ చూడటం కూడా మానేశారు.ఇక సీరియల్‌లో నటించకపోయిన ప్రేమి విశ్వనాధ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు తన అప్డేట్స్ ఇస్తూ వస్తోంది.అభిమానులు పదేపదే మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారంటూ ప్రేమీకి మెసేజెస్ చేస్తూనే ఉన్నారట..కాగా ఇదిలా ఉంటే తాజాగా వంటలక్క అభిమానులకు సీరియల్ బృందం శుభవార్త చెప్పింది.

తాజాగా ప్రేమి విశ్వనాథ్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది.‘మీకోసం వస్తున్నా’ అనే క్యాప్షన్ కూడా దానికి జోడించింది. ఆ వీడియోలో దీప రెడీ అవుతుండగా తన అసిస్టెంట్ వచ్చి దీప మేడం షార్ట్ రెడీ అని అనడంతో ఒకసారిగా కెమెరా వైపు తిరిగి ఆ వస్తున్నా అని అంటుంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. వంటలక్క రీఎంట్రీ ఇవ్వనుందని ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి