Home » Entertainment » Deepika Pilli Cute Dance Instagram Reel Video
Entertainment

Deepika Pilli : దీపిక పిల్లి చిందులు.. పొట్టి బట్టల్లో క్రేజీ యాంకర్ రచ్చ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 26, 2022, 7:00 pm
Advertisement

Deepika Pilli : బుల్లితెరపై దీపిక పిల్లికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. సోలో యాంకర్‌గా బాగానే దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ ధమాకాలో దీపిక పిల్లి బాగానే ఆకట్టుకుంటోంది. ఆమె క్యూట్ అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అయితే ఆమెకు ఇతర ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆమెను అంతగా ప్రొడక్షన్ కంపెనీలు పట్టించుకోడం లేనట్టుంది. అయినా దీపిక పిల్లికి మాత్రం నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. ఆమెకు మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఇక ఆమె షేర్ చేసే ఫోటోలు, రీల్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. టిక్ టాప్ యాప్ ద్వారా ఫేమస్ అయిన దీపిక పిల్లి.. ఆ తరువాత ఢీ షోకి వచ్చింది.

Advertisement

అక్కడ అంతగా పేరు అయితే సంపాదించుకోలేదు. కానీ రష్మీ, ఆది వంటి వారితో పరిచయాలు తరువాత బాగానే ఉపయోగపడ్డట్టున్నాయి. ఇప్పుడు రష్మీతో దీపిక పిల్లి ఎక్కువ క్లోజ్‌గా ఉంటుంది. ఈ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్ల మాదిరి ఉంటారు. దీపిక ఎక్కువగా రష్మీ చెంత ఉంటుంది. వాళ్లింట్లోనే ఉంటుంది. ఇక రష్మీ అడుగుజాడల్లోనే నడుస్తూ కుక్కలను ఆదరిస్తోంది దీపిక పిల్లి. రష్మీ ఇన్ స్పిరేషన్‌తో పెట్స్‌ను అడాప్ట్ చేసుకుంది దీపిక పిల్లి. ఇక దీపిక పిల్లి ఇప్పుడు వెండితెరపైనా వెలిగేందుకు రెడీగా ఉంది. కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సినిమా రాబోతోంది.

Deepika Pilli Cute Dance instagram Reel Video

Advertisement

ఇందులో బుల్లితెర తారలు ఎక్కువగా నటించారు. వాంటెడ్ పండుగాడు అనే ఈ సినిమా కోసం సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ, దీపిక పిల్లి వంటి వారు నటించారు. మరి ఈ సినిమాతో దీపిక పిల్లికి సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. ఇందులో దీపిక పిల్లి మంచి పాత్రలోనే నటించినట్టు తెలుస్తోంది. మొత్తానికి అన్ని చోట్లా దీపిక పిల్లి తన సత్తాను చాటేందుకు ట్రై చేస్తోంది. ఇక నెట్టింట్లో అయితే డ్యాన్స్ వీడియోలతో దీపిక అదరగొట్టేస్తుంటుంది. తాజాగా ఆమె పొట్టి బట్టలను వేసుకుని చేసిన రీల్ వీడియో బాగానే వైరల్ అవుతోంది. ఇక ఆమె ఈ వీకెండ్ కోసం బెంగళూరుకి వెళ్లినట్టు తెలుస్తోంది. వీకెండ్ పార్టీలను దీపిక పిల్లి బాగా ఎంజాయ్ చేస్తుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి