Deepthi Sunaina : దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత షన్ముఖ్ ఎంత నష్టపోయాడో తెలుసా..!
Deepthi Sunaina : బిగ్ బాస్ తెలుగు లో అడుగు పెట్టడం వల్ల క్రేజ్ పెరిగి.. స్టార్ డమ్ పెరిగి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఆధాయం కూడా పెరుగుతుందని అంతా అనుకుంటూ ఉంటారు. కాని దీప్తి సునైన మాజీ ప్రియుడు షన్ముఖ్ జష్వంత్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన కెరీర్ అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారింది. బిగ్ బాస్ కు ముందు యూట్యూబ్ సూపర్ స్టార్ అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం […]
Deepthi Sunaina : బిగ్ బాస్ తెలుగు లో అడుగు పెట్టడం వల్ల క్రేజ్ పెరిగి.. స్టార్ డమ్ పెరిగి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఆధాయం కూడా పెరుగుతుందని అంతా అనుకుంటూ ఉంటారు. కాని దీప్తి సునైన మాజీ ప్రియుడు షన్ముఖ్ జష్వంత్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన కెరీర్ అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారింది. బిగ్ బాస్ కు ముందు యూట్యూబ్ సూపర్ స్టార్ అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం జీరో అయిపోయి ఏం చేయాలో పాలు పోక ఇన్ స్టా గ్రామ్ లో ఏవో పోస్ట్ లు పెడుతూ నెట్టుకు వస్తున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
దీప్తి సునైనతో పీకలలోతు ప్రేమలో ఉండి.. పెళ్లికి కూడా సిద్దం అయ్యి అంతా ఓకే అనుకున్న తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి స్నేహితురాలు అంటూ సిరితో ప్రేమలో పడటం ఆయనకే చెల్లింది. నాకు ఇద్దరు కావాలి.. ఇద్దరు ముఖ్యం అనే పరిస్థితికి ఆయన చేరాడు అంటూ విమర్శలు వచ్చాయి. షన్నూ పరిస్థితి గురించి కొందరు జాలి పడ్డా ఎక్కువ శాతం మంది విమర్శించారు. బిగ్ బాస్ లో అడుగు పెట్టడం వల్ల జరిగిన నష్టం కేవలం దీప్తి సునైన నుండి విడి పోవడం మాత్రమే కాదు.. ఆయనకు భారీగా నష్టం జరిగిందట. షన్నూ ఈమద్య కాలంలో యూట్యూబ్ లో వీడియోలు యాక్టివ్ గా చేయడం లేదు. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఎలా దూసుకు పోవాలి. కాని ఇప్పటి వరకు ఎలాంటి హడావుడి లేదు.
అసలు దీప్తి సునైన బ్రేకప్ అయిన తర్వాత జనాలు ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. అసలు ఏం జరిగిందో తెలియనట్లుగా ఇద్దరు ఉంటున్నారు. అయినా కూడా ఫిల్మ్ మేకర్స్ కాని మరెవ్వరైనా కాని అసలు పెద్దగా స్పందించడం లేదు. ఏం చేయాలో పాలుపోక షన్నూ ఆఫర్ల కోసం అటు ఇటు చూస్తున్నారు. ఇటీవల ఆహా నుండి ఏదో చిన్న ఆఫర్ అయితే వచ్చింది కాని సినిమాల్లో లేదా ఇతర ప్లాట్ ఫామ్ లపై పెద్దగా సందడే ఈయన చేయడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు నెలకు పది నుండి పదిహేను లక్షల వరకు ఆదాయం దక్కించుకున్న షన్నూ ఇప్పుడు అయిదు లక్షలు కూడా ఆదాయం లేక ఢీలా పడ్డాడు.