Deepthi Sunaina shanmukh : బ్రేకప్ తర్వాత షన్నూకు దీప్తి సునయన కండిషన్స్.. అలా ఉంటేనే మళ్లీ కలిసేది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi Sunaina shanmukh : బ్రేకప్ తర్వాత షన్నూకు దీప్తి సునయన కండిషన్స్.. అలా ఉంటేనే మళ్లీ కలిసేది..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 January 2022,7:00 pm

Deepti-shannu : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అది జరిగేది ఒక్కరోజు మాత్రమే. కానీ దానిని మీడియా, డిజిటల్ జర్నలిజం ముసుగులో కొందరు ఏది పడితే అది రాసేస్తుంటారు. అదే నిజం అని నమ్మి కొందరు ప్రజలు మోసపోతుంటారు. తీరా అది నిజం కాదని తెలిసి బాధపడుతుంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయ్యాయి. సామ్-చై విడాకులు తీసుకుని రెండు నెలలు పూర్తవ్వడానికి వస్తున్నా నేటికీ వీరిద్దరి విడాకులపై వార్తలు వస్తుంటాయి. నిజానికి సామ్ చై ఎవరి బిజీలో వారున్నారు. కొందరు పనిగట్టుకుని గాసిప్స్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో తర్వాత దీప్తి సునయన తన ప్రియుడు షణ్ముక్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.

Deepthi Sunaina shanmukh : కొత్తగా షన్నూకు దీప్తి పెడుతున్న కండిషన్స్..

వాస్తవానికి దీప్తి, షన్నూ ఏకాభిప్రాయంతో విడిపోయారు. షణ్ముక్ కూడా బ్రేకప్ విషయమై పాజిటివ్‌గా స్పందించాడు. ‘ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ దీపు’ఇన్ స్టాలో అంటూ పోస్టు పెట్టాడు. వారిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగానే ఉన్నారు. కానీ బయట వాళ్లకే అసలు ప్రాబ్లమ్. ఏదో ఒక చిన్న లైన్ తీసుకుని ఏవో ఏవో గాసిప్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అవి నిజం అని నమ్మి కొందరు షేర్ చేస్తుంటారు.

Deepthi Sunaina conditions for shanmukh after breakup

Deepthi Sunaina conditions for shanmukh after breakup

తాజాగా దీప్తి సునయన తన ప్రియుడు షణ్ముక్‌తో మాట్లాడుతోందని, తామిద్దరం మళ్లీ కలిసి ఉండాలంటే నువ్వు ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలంటూ చెప్పిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. అంతగా దీప్తి షణ్ముక్‌కు ఏం కండిషన్స్ పెట్టిందో బయటకు మాత్రం రివీల్ కాలేదు. అయితే, యూట్యూబ్ స్టార్స్ అయినటువంటి దీప్తి, షన్నూలు మొదట కవర్ సాంగ్స్‌తో అలరించారు. తర్వాత వారికి జనాల్లో పాపులారిటీ రావడడంతో ఇద్దరూ కలిసి అనేక షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అదే విధంగా వెబ్ సిరీస్ చేసి మంచి పేరును సంపాదించారు.ఈ క్రమంలోనే వీళ్లిద్దరి స్నేహం బలపడి అది ప్రేమకు దారి తీసింది. ఐదేళ్లు వీరి లవ్ సంతోషంగా సాగింది. బిగ్‌బాస్ షోలో సిరి, షన్నూ ఓవరాక్షన్ మూలానా దీప్తి తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది