Deepthi Sunaina : దీప్తి సున‌య‌న వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌న్స్

Advertisement

Deepthi Sunaina : సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో దీప్తి సున‌య‌న ఒక‌రు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు తనీష్ తో రొమాన్స్ చేస్తూ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. బిగ్ బాస్ త‌ర్వాత కూడా దీప్తి సున‌య‌న అంద‌రి నోళ్ల‌లో నానుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉండేది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.

Advertisement

Deepthi Sunaina : దీప్తి అందాల ర‌చ్చ‌..

ష‌ణ్ముఖ్ – దీప్తి సున‌య‌న పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండ‌గా, ఎప్పుడైతే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడో వీళ్ల బంధం బీటలు వారింది. షణ్ముఖ్.. సిరి హనుమంత్‌కి దగ్గర కావడంతో.. హగ్‌లు ముద్దులతో రెచ్చిపోయి ప్రవర్తించడం.. హద్దులుదాటి రొమాన్స్ చేయడం.. ఒకర్నివిడిచి ఒకరం బతకలేం అన్నట్టుగా వ్యవహరించడం చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వచ్చిన వెంట‌నే త‌న బ్రేక‌ప్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది దీప్తి. ఇక అప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

Advertisement
deepthi sunaina cute video viral on instagram
deepthi sunaina cute video viral on instagram

అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. చీర‌క‌ట్టులో అయిన ట్రెడిష‌న‌ల్ లుక్ లో అయిన దీప్తి కేక పెట్టించ‌డం ఖాయం. యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.

Advertisement