Deepthi Sunaina : పూజా హెగ్డే, స‌మంత బాట‌లో దీప్తి సున‌య‌న‌…కుర్రాళ్ల‌తో ఆ రచ్చేంది..!

Authored By Sam C | The Telugu News | Updated on: February 20, 2022, 10:20 am

Deepthi Sunaina : ఇటీవ‌ల కాలంలో సూప‌ర్ హిట్ అయిన పాట‌ల‌లో విజ‌య్ బీస్ట్ సినిమాలో అర‌బిక్ కుతు సాంగ్ ఒక‌టి.ఈ పాట‌కి కొద్ది రోజుల క్రితం పూజా హెగ్డే షిప్‌లో స్టెప్పులు వేసింది. అంతే కాకుండా మీరు కూడా చేయండి అంటూ పిలుపునిచ్చింది. దీనితో సమంత కాస్త డిఫరెంట్ గా స్టెప్స్ వేసింది . ఇంకో లేట్ నైట్ ఫ్లైట్…అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది. సమంత పోస్ట్ చేసిన కాసేపటికే నటి సన్యా మల్హోత్రా, లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి, అనిరుధ్ ఆయుష్మాన్ ఖురానా, పూజా హెగ్డే వంటి స్టార్స్ లైక్స్ కొట్టారు. ఇక అంత‌టితో ఈ పాట హ‌వా ఆగ‌లేదు. యూ ట్యూబ‌ర్ దీప్తి సున‌య‌న కూడా సోష‌ల్ మీడియా షేక్ అయ్యేలా స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టింది. కుర్రాళ్ల‌తో రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. దీప్తి క్యూట్ మూమెంట్స్ కి కుర్ర‌కారు మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు.

దీప్తి సునైనా షణ్ముఖ్ జోడి సోషల్ మీడియాలో బెస్ట్ కపుల్ గా ఉండేవారు.కానీ ఇటీవల బిగ్ బాస్ షో వారి మద్య ఉన్న అనుబంధాన్ని తెంచేసింది.బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ -సిరి మద్య ఉన్న రెలేషన్ వల్ల దీప్తి- షణ్ముఖ్ విడిపోవాల్సి వచ్చింది. ఎప్ప‌డైతే ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పిందో అప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది దీప్తి. ఇటీవ‌ల డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి కూడా స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు.

deepthi sunaina dance for pooja latest movie song

deepthi sunaina dance for pooja latest movie song

Deepthi Sunaina : దీప్తి ధనాధ‌న్…

ఒక‌ప్పుడు దీప్తి సునయనకు బుల్లితెర, వెండితెర మీద మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం దీప్తి సునయన చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. బుల్లితెరపై ఎక్కడా కనిపించడం లేదు. ఇక వెండితెరపై మాత్రం అస్సలే అవకాశాలు రావడం లేదు. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్, స్పెషల్ ప్రైవేట్ ఆల్బమ్‌లతో కనిపిస్తుంటుంది. ఆ మ‌ధ్య టాలీవుడ్‌కు దీప్తి సునయన హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ కొన్ని మీమ్ పేజీలు హల్చల్ చేశాయి. అయితే వీటిపై దీప్తి సునయన స్పందించింది. అవి ఫేక్ అంటూ కొట్టి పారేసింది. నాకు తెలీదే ఇది అంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి దీప్తి సునయన మాత్రం ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కు దూరంగానే ఉన్నట్టుంది.

Sam C

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp