Deepthi Sunaina : ఎరుపు రంగు చీరలో కన్ను కొడుతున్న దీప్తి సునయన.. చూస్తే ఫిదా అవుతారంతే..!
Deepti Sunayana : దీప్తి సునయన అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా లవర్స్‌కు ఈమె చాలా పరిచయస్తురాలు. ఇక యూ ట్యూబ్ వీడియోలతో పాటు బిగ్ బాస్ లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల సుందరి. ఇక మొన్న షణ్ముఖ్ బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత ఆమె నిత్యం వార్తల్లో నిలిచారు. ఏకంగా బిగ్ బాస్ సెట్ కు వచ్చి మరీ ప్రపోజ్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక బయటి నుంచి షణ్ముఖ్ కోసం ఆమెచేసిన సపోర్టు అంతా ఇంతా కాదండోయ్.
అయితే ఇంత చేసినా ఆమెకు చివరకు ఒంటరితనమే మిగిలింది.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ తో విడిపోయినట్టు ప్రకటించింది దీప్తి సునయన. వాస్తవానికి వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని అంతా ఆశించారు. ఇక వీరి జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇరువురి ఇండ్లలో కూడా ఒప్పుకున్నారని వీరే స్వయంగా వెల్లడించారు.
Deepthi Sunaina : సోషల్ మీడియాలో పిక్ వైరల్..
కానీ చివరకు ఇలా విడిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్న దీప్తి.. తన కెరీర్ పై ఫోకస్ పెడుతోంది. ఇకపోతే ఇప్పుడు ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్ తెగ ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు చీరలో ఉన్న ఆమె.. కొంటెగా నవ్వుతున్నట్టు ఇందులో మనకు కనిపిస్తుంది. ఆ ఫొటోను చూసినంతనే ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు.