Deepthi Sunaina Shanmukh : మరో కొటేషన్ షేర్ చేసిన దీప్తి సునయన.. ఆమె ఉద్దేశం అదేనా..?
Deepthi Sunaina shanmukh: గత ఏడాది చివరలో తన సోషల్ మీడియా ద్వారా షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది దీప్తి సునయన. బ్రేకప్ చెప్పినప్పటి నుండి ఈ అమ్మడు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో ఎక్కుతుంది. తన బాధను దిగమింగేందుకు దీప్తి తన సోషల్ మీడియాని బాగా వాడుకుంటుంది. నిత్యం పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ షేర్ చేస్తుంది. తన ఇన్ స్టా స్టోరీలో ‘మనుషులంతా కూడా అబద్దాలనే ఇష్టపడుతున్నారు.. ఎందుకంటే అవి నిజాలకంటే ఎంతో కంఫర్ట్‌గా ఉంటాయి.. నిజం బట్టలిప్పి అందరినీ నగ్నంగా నిలబెడుతుంది.
అబద్దాలు వాటిని కవర్ చేస్తుంటాయి’ అనే ఆర్జీవీ ట్వీట్‌ను రీసెంట్‌గా పోస్ట్ చేసింది.తాజాగా దీప్తి సునయన ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. ఈ కొత్త ఏడాది ఏంటో ఇలా ఉంది.. కొందరు ఒంటరిగా (Solo) బతుకుతున్నారు.. ఇంకొందరు బాధల్లో ఉన్నారు.. (So Low).. మరి కొందరు డోలో (Dolo) వేసుకుంటూ ఉన్నారు అని ఓ పోస్ట్‌ను దీప్తి సునయన తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. వావ్ వావ్ అంటూ దీప్తి సునయన చెప్పుకొచ్చింది. అంటే తాను కూడా ఈ మూడు పరిస్థితులు అనుభవిస్తున్నట్టు చెప్పకనే చెప్పేసింది.

deepthi sunaina stunning pecial quotation on breakup
Deepthi Sunaina shanmukh : దీప్తి పోస్ట్ అంతరార్ధం ఏంటి?
దీప్తి సునయన..షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పిన అతను మాత్రం దీప్తి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆమె మనసు మళ్లీ మారుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. తాను ఎలాంటి కామెంట్స్ పెట్టినా, ఏమన్నా కూడా షణ్ముఖ్ చాలా ఓపికగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవల షణ్ముఖ్ తండ్రి త్వరలోనే వీరిద్దరు కలుస్తారు, ఎవరు ఆందోళన చెప్పోద్దంటూ గుడ్ న్యూస్ చెప్పి అందరికి ఆనందం కలిగించాడు.