Deepthi Sunaina : సింగ‌ర్‌గా మారిన దీప్తి సున‌య‌న‌.. బాధ‌ని ఇలా వ్య‌క్తం చేసిందా?

Authored By Sam C | The Telugu News | Published on: March 8, 2022, 11:00 am

Deepthi Sunaina : యూట్యూబ‌ర్ దీప్తి సున‌య‌న ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తూ అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. ఎంతో హ్యాపీగా ఉండే దీప్తి సునయనకి ఈ ఏడాది ప్రారంభంలోనే భంగపాటు ఏర్పడింది. తన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది రోజే కొత్త నిర్ణయం తీసుకుంది దీప్తి సునయన. షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెబుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా సడెన్‌గా బ్రేకప్ చెప్పేందుకు దీప్తి సునయనకు చాలానే కారణాలున్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా బిగ్ బాస్ షోలో సిరి, షన్నులు చేసిన పనులు, నడిపించిన ట్రాక్‌కు దీప్తి విసిగెత్తిపోయి ఉంటుందని ప‌లువురు చెబుతున్నారు.

దీప్తి సున‌యన ఇటీవ‌లి కాలంలో తెగ వీడియోలు చేస్తూ అల‌రిస్తుంది. ఈ అమ్మడు మ్యూజిక‌ల్ వీడియోలు కూడా చేస్తూ సంద‌డి చేస్తుంది. ఏమై ఉండొచ్చో అంటూ దీప్తి సున‌య‌న‌కి సంబంధించిన వీడియో ఒక‌టి ఇటీవ‌ల విడుద‌ల కాగా, రీసెంట్‌గా అదే సాంగ్ పాడింది దీప్తి. ఈ అమ్మ‌డు రోజురోజుకు తెగ ఫాస్ట్ అవుతుంది. అస‌లు ఈమె జోరుకి అడ్డుక‌ట్ట వేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కావ‌డం లేదుగా. ష‌ణ్ముఖ్‌ని మిస్ అయిన బాధ‌ని మ‌ర‌చిపోయేందుకు దీప్తి ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంది. దీప్తి సున‌య‌న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

deepthi sunaina sings a song

deepthi sunaina sings a song

Deepthi Sunaina : దీప్తి ర‌చ్చ మాములుగా లేదు..

ఇక ష‌ణ్ముఖ్ విష‌యానికి వ‌స్తే వరుస ఫెయిల్యూర్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న షణ్ముఖ్‌ తన కల నెరవేర్చుకున్నాడు. తన ఫేవరెట్‌ హీరో సూర్యను కలిశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈటీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లాంచ్‌లో సూర్యను కలిసే ఛాన్స్‌ దక్కించుకున్న షణ్ను తన హీరోను నేరుగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘మార్చి 3 చాలా సంతోషకరమైన రోజు. కొన్ని నెలలుగా ఎన్నో ఫెయిల్యూర్స్‌ చూసిన నేను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు, మనోజ్‌లకు ధన్యవాదాలు, ఐ లవ్‌ యూ సూర్య అన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp