Deepthi Sunaina : క్యూట్ లుక్స్ తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న దీప్తీ సునైనా.. డార్క్ లైట్ లో అందాల ఆర‌బోత‌

Authored By mallesh | The Telugu News | Published on: June 12, 2022, 11:00 am

Deepthi Sunaina : డబ్ స్మాష్ వీడియోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన దీప్తీ సునైనా ఆ త‌ర్వాత యూట్యూబ‌ర్ గా మ‌స్తు పాపులారిటీ సొంతం చేసుకుంది. సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. త్రీ మిలియ‌న్స్ కి పైగా ఇన్ స్టాలో ఫాలోవ‌ర్స్ ని సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోతో ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమ‌స్ అయింది. అలాగే ప‌లు సినిమాల్లో కూడా న‌టించే చాన్స్ కొట్టేసింది ఈ అమ్మ‌డు.

హైద‌రాబాద్ లో పుట్టి పెరిగిన దీప్తి కో స్టార్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్ యూట్యూబ్ లో బోలెడ‌న్ని డ్యాన్స్ వీడియోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ష‌ణ్ముక్ తో ప్రేమ‌లో ప‌డి మునిగితేలింది.అయితే ష‌ణ్ముక్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఆషోలో సిరి హ‌నుమంతుతో చేసిన ర‌చ్చ త‌ర్వాత దీప్తి షణ్ముక్ కి బ్రేక‌ప్ చెప్పేసింది. ఆ త‌ర్వాత కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉన్న దీప్తి ప్ర‌స్తుతం వ‌రుస ఫొటో షూట్స్ తో రెచ్చిపోతోంది. హాట్ హాట్ అందాల‌తో బీచ్ లో కేర‌ళ వంటి ప్ర‌దేశాల్లో సంద‌డి చేస్తూ ఆక‌ట్టుకుంది. వ‌రుస ఫొటో షూట్స్ , వీడియోస్ తో సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తోంది.

Deepti Sunaina Cute Looks Video Viral 

Deepti Sunaina Cute Looks Video Viral

అలాగే ప‌లు స్పెష‌ల్ సాంగ్స్ లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇక చీర‌క‌ట్టులో పొట్టి డ్రెస్తుల్లో ఎద, న‌డుము అందాల‌తో క‌నువిందు చేస్తోంది.ప్ర‌స్తుతం దీప్తి ఓ ఫొటో షూట్ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. బ్లూ టాప్ క‌ల‌ర్ ఫుల్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో అందాల‌ను చూపిస్తూ మ‌తి పోగొడ‌తోంది. బెడ్ పై కూర్చుని వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఆక‌ట్టుకుంటోంది. తెలుగు రొమాంటిక్ సాంగ్ కి హావ‌భావాలు పలికిస్తూ ర‌చ్చ చేస్తోంది. కొంటె చూపుల‌తో కురుల‌తో మీసాలు పెడుతూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp