Shanmukh Jaswanth : ఆ మాటలు చెప్పే దీప్తి సునయను పడేశాను.. గుట్టు విప్పిన షణ్ముఖ్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 17, 2021, 6:30 pm

Shanmukh Jaswanth : షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో నానుతూ వస్తోంది. అయితే దీప్తి సునయన మాత్రం బిగ్ బాస్ 5 తెలుగు రెండో సీజన్‌లోనే ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసింది. తన బ్రేకప్ స్టోరీ, మళ్లీ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమ కథలను చెప్పేసింది. అయితే షణ్ముఖ్ మాత్రం ఎప్పుడూ కూడా తమ ప్రేమ వ్యవహారం గురించి నోరు విప్పలేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లో మాత్రం ఎంతో ఒపెన్‌గా మాట్లాడుతున్నాడు.

Shanmukh Jaswanth About Deepthi Sunaiana Love Story In Bigg Boss 5 Telugu

Shanmukh Jaswanth About Deepthi Sunaiana Love Story In Bigg Boss 5 Telugu

ప్రేమ కథను చెప్పిన షన్ను.. Shanmukh Jaswanth

గత వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ముందు షన్ను బుక్ కావాల్సి వచ్చింది. తన దిండు గురించి, దాని మీద ఉన్న అక్షరాల గురించి కంటెస్టెంట్లు నాగార్జునకు చెప్పేశారు. అలా తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి అంటూ నాగ్ ముందే షన్ను బయటకు చెప్పేశాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో అందరూ కలిసి షన్నును ఏడిపించారు. యాంకర్ రవి, హమీద ఇలా అందరూ షన్నును ఆడుకున్నారు. హమీద షన్ను అంటూ కొత్త ట్రాక్‌ను క్రియేట్ చేసేందుకు యాంకర్ రవి ట్రై చేశాడు.

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

ఇంట్లో ఉన్నంత వరకు దిండు ఎస్ హెచ్ అని రాసుకో.. బయటకు వెళ్లాక.. డీ ఎస్ అని ఉంచుకో అని హమీద కూడా కౌంటర్ వేసింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని షణ్ముఖ్, హమీద చెప్పుకొచ్చారు. అయితే ప్రేమకు పునాది స్నేహమే అని రవి ఓ డైలాగ్ కొట్టేశాడు. ఆ వెంటనే షన్ను రియాక్ట్ అవుతూ.. అలాంటి మాటలు చెప్పే దాన్ని పడేశాను అని దీప్తి సునయనతో ప్రేమ వ్యవహారాన్ని మరోసారి చెప్పేశాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో షన్ను బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. దీప్తి సునయన అందించిన స్పెషల్ విషెస్‌ను బిగ్ బాస్ చూపించేశాడు.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp