Categories: EntertainmentNews

Allu Arjun : దేశ ముదురు మూవీని మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. ఆ చిత్రం చేసి ఉంటేనా..!

Allu Arjun : దేశ ముదురు మూవీ desamuduru movie బ‌న్నీ Bunny  కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. ఆ చిత్రం అల్లు అర్జున్‌ ని మాస్ హీరోగా నిల‌బెట్టింది. ఆర్య`తో హిట్‌ అందుకుని ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు బన్నీ. ఆ తర్వాత `బన్నీ వంటి మాస్‌ హిట్‌ పడింది. ఈ మూవీతో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ నుంచి మాస్‌ ఇమేజ్‌కి టర్న్ తీసుకున్నాడు. ఆ వెంటనే హ్యాపీ`తో డిజాస్టర్‌ పడింది. దాన్నుంచి కోలుకునేలా చేసింది `దేశముదురు సినిమా. . దేశ ముదురు కుర్రాళ్లలోనూ చాలా ప్రభావం చూపించడం విశేషం. ఏ హీరో అయినా పూరీ జగన్నాథ్‌ చేతిలో పడితే మాస్‌ హీరోగా నిలబడతాడనే కామెంట్ ఉంది. దాన్ని బన్నీ విషయంలో నిజం చేసిన సినిమాగా చెప్పొచ్చు.

Allu Arjun అది న‌చ్చ‌క రిజెక్ట్..

అల్లు అర్జున్‌కి ఎంత‌గానో క‌లిసి వ‌చ్చిన దేశ ముదురు చిత్రం మొద‌ట అక్కినేని హీరో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ట‌. సుమంత్‌ వద్దకు ఈ స్క్రిప్ట్ వెళ్లింది. పూరీ జగన్నాథ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి సుమంత్‌ని అప్రోచ్ అయి ఈ కథ చెప్పారు. కానీ దీన్ని ఆయన రిజెక్ట్ చేశారు. కథ నచ్చలేదని, ప్రధానంగా ఈ పాయింట్‌లో మోరాలిటీ లేదని, తాను చేయనని చెప్పేశాడట. చాలా కన్విన్స్ చేసినా వినలేదు. పూరీ మాత్రమే కాదు, త్రివిక్రమ్‌ కూడా చాలా చెప్పి చూశారు, కానీ సుమంత్‌ ఎవరి మాట వినలేదు. దీంతో ఆయన్నుంచి సినిమా వెళ్లిపోయింది. సుమంత్‌ రిజెక్ట్ చేసిన ఈ సినిమాని అల్లు అర్జున్‌ ఓకే చేశారు. మాస్‌ ఎలిమెంట్లు నచ్చి ఓకే చెప్పారు. అలాగే లవ్‌ ట్రాక్‌ కూడా కొత్తగా ఉండటంతో క్రేజీగా ఉంటుందని భావించి బన్నీ ఓకే చెప్పారు.

Allu Arjun : దేశ ముదురు మూవీని మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. ఆ చిత్రం చేసి ఉంటేనా..!

ఇందులో బన్నీని వేరే రేంజ్‌లో చూపించారు పూరీ జగన్నాథ్‌. 2007 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ అయ్యింది. అల్లు అర్జున్‌ మాస్‌ హీరోగా నిలబడ్డాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆయనకు తిరుగులేదు అనేంతటి విజయం ఈ సినిమా ద్వారా దక్కడం విశేషం. సన్యాసిగా ఉన్న హీరోయిన్‌ వద్దకు వెళ్లి ఆమెని డిస్టర్బ్ చేయడం, లవ్‌ ప్రపోజ్‌ చేయడం అనే ఎలిమెంట్లు సుమంత్‌కి నచ్చలేదట. అందులో నైతికత లేదని భావించాడట సుమంత్‌ Sumanth . అందుకే నో చెప్పాడట. కానీ ఆ సినిమా చేసి ఉంటే సుమంత్‌ రేంజ్‌ మారిపోయేది. మాస్ హీరోగా నిలబడేవాడు. ఆ టైమ్‌లో ఆ సినిమా పడితే సుమంత్‌ ఇమేజ్‌, మార్కెట్‌ పెరిగేది, తన కథల రేంజ్‌ పెరిగేది. ఓవరాల్‌గా ఆయన హీరోగా నెక్ట్స్ లెవల్ కి వెళ్లేవాడు.

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

30 minutes ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

2 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

3 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

4 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

5 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

6 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

8 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

8 hours ago