War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. హృతిక్ – ఎన్టీఆర్ కలయిక వ‌ర్క‌వుట్ అయిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. హృతిక్ – ఎన్టీఆర్ కలయిక వ‌ర్క‌వుట్ అయిందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2025,8:43 am

ప్రధానాంశాలు:

  •  War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. హృతిక్ - ఎన్టీఆర్ కలయిక వ‌ర్క‌వుట్ అయిందా..?

War 2 Movie Review : ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ గ్రీకు గాడ్ hrithik roshan హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ Jr Ntr  కలిసి నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు ఓ సారి విశ్లేషించుకుందాం.

War 2 Movie Review వార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌ హృతిక్ ఎన్టీఆర్ కలయిక వ‌ర్క‌వుట్ అయిందా

War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. హృతిక్ – ఎన్టీఆర్ కలయిక వ‌ర్క‌వుట్ అయిందా..?

War 2 Movie Review : కథ సంగతేంటి ?

కొన్నాళ్లుగా కనిపించకుండా ఉన్న సూపర్ స్పై కబీర్ (హృతిక్ రోషన్) ను పట్టుకోవడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక దళాన్ని రంగంలోకి దించుతుంది. కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదనుకున్న అధికారులు, మరో స్పెషల్ ఏజెంట్ అజయ్ (ఎన్టీఆర్) ను ఆ మిషన్‌కు నియమిస్తారు. మిషన్‌ ఫెయిల్ అయితే దాని పరిణామాలు దేశ భద్రతపై ఎంత ప్రభావం చూపిస్తాయో చెప్పక్కర్లేదు.హృతిక్- ఎన్టీఆర్ మధ్య జరిగిన ఈ మైండ్ గేమ్, మిషన్ ఫెయిలవుతుందా? సక్సెస్ అవుతుందా? అనే అంశాలే కథను మోస్తాయి.

War 2 Movie Review ప‌ర్‌ఫార్మెన్స్ :

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయిక తెరపై మంచి మాస్ మూమెంట్స్‌ను అందిస్తుంది. ఫైట్స్, ఛేజింగ్ సీన్స్ హై వోల్టేజ్ యాక్షన్‌తో నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. హృతిక్ రోషన్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో మరింత లోతైన పాత్రలో కనిపించాడు. ఎన్టీఆర్ అయితే తన రేంజ్ ఏంటో మళ్లీ ఒకసారి చూపించాడు. కియారా అద్వాని పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, ఆమె గ్లామర్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. బికినీ సీన్స్‌లో ఆమెకి వచ్చిన స్పందనే చెప్పన‌క్క‌ర్లేదు. స్క్రీన్ టైమ్ తక్కువైనా, తన స్టైల్‌తో గుర్తుండే విధంగా నటించింది.

టెక్నికల్ పరంగా చూస్తే.. ముఖ్యమైన ఎమోషనల్, ఎలివేషన్ సీన్లలో BGM వర్కౌట్ కాకపోవడం సినిమా మీద ఇంపాక్ట్ పడింది. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని సన్నివేశాలు నెచురల్‌గా కాకుండా, కృత్రిమంగా అనిపించాయి. కొన్ని సీన్లు గట్టి ఎడిటింగ్ చేసి ఉంటే సినిమాకు మరింత గట్టిపుంత పడేది. ప్రొడక్షన్ వాల్యూస్: హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. అయితేఎగ్జిక్యూష‌న్ ప‌రంగా కొంత క‌న్సిస్టెన్సీ మిస్ అయింది.

న‌టీన‌టులు: ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్, కియారా అద్వాని kiara advani
ద‌ర్శ‌కుడు: అయాన్ ముఖ‌ర్జీ
మ్యూజిక్ : ప్రీత‌మ్ చ‌క్ర‌వ‌ర్తి, సంచిత్ బ‌ల్హ‌రా
నిర్మాత‌: య‌ష్ రాజ్ ఫిలింస్
రిలీజ్ డేట్: ఆగ‌స్ట్ 14, 2025

War 2 Movie Review ప్లస్ పాయింట్స్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్టింగ్
ఇంటర్వెల్ సీన్
ఫస్టాఫ్

War 2 Movie Review మైనస్ పాయింట్స్

మ్యూజిక్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్

విశ్లేషణ:

దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌ను టార్గెట్ చేస్తూ మాస్-క్లాస్‌ను బ్యాలెన్స్ చేయాలన్న కసరత్తు చేశారు. అయితే కథలో ఓ రొటీన్ టోన్ స్పష్టంగా కనిపిస్తుంది. ‘వార్’, ‘పఠాన్’ లాంటి బాలీవుడ్ స్పై యూనివర్స్ సినిమాలతో పోల్చితే కథలో పెద్దగా కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. కానీ స్క్రీన్ ప్లే పరంగా మొదటి భాగం ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది.ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ బ్లాక్ సినిమాకు హైప్ను పెంచేలా ఉండగా, ఇంటర్వెల్ ట్విస్ట్ థియేటర్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సెకండాఫ్ లో మాత్రం పేసింగ్ కొంత నెమ్మదించడంతో కొంతవరకు గ్రిప్ తప్పినట్లే అనిపిస్తుంది.‘వార్ 2’లో భారీ నటీనటుల కలయిక, శక్తివంతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ ప్రెజెంటేషన్ పాజిటివ్ పాయింట్స్. అయితే కథ, స్క్రీన్‌ప్లేలో మరింత కొత్త‌ద‌నం, ఎమోషనల్ కనెక్ట్, మెరుగైన టెక్నికల్ పనితనం ఉంటే బాగుండేది.

రేటింగ్: 2.5/5

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది