Devara Box Office Collections : దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల‌లో షేర్ ఎంతంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Devara Box Office Collections : దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల‌లో షేర్ ఎంతంటే..!

Devara Box Office Collections : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబ‌డుతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూల్ చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే రూ.140 నుంచి రూ.150 వచ్చినట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. డే వన్ రోజు తెలంగాణ, ఏపీలో కలిసి రూ.68 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Devara Box Office Collections : దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల‌లో షేర్ ఎంతంటే..!

Devara Box Office Collections : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబ‌డుతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూల్ చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే రూ.140 నుంచి రూ.150 వచ్చినట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. డే వన్ రోజు తెలంగాణ, ఏపీలో కలిసి రూ.68 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో రూ.7 కోట్లు, తమిళం రూ.80 లక్షలు, కన్నడ రూ.30, మళయాలంలో రూ.30 వచ్చాయి. అర్ధరాత్రి బెన్ ఫిట్ షోల నుంచి మొదటి రోజు లాస్ట్ షో వరకు తెలుగు రాష్ట్రాలలో దేవర మూవీని చూడటానికి అత్యధిక మంది తరలివెళ్లారు. చాలా వరకు థియేటర్స్ హౌస్ ఫుల్ పడ్డాయి.

Devara Box Office Collections దేవ‌ర హ‌వా..

‘దేవర’ మొదటి రోజు ఏకంగా 54.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ షేర్ ని ‘దేవర’ మూవీ అందుకుందని తెలిపారు. ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో మొదటి రోజు ఏకంగా 19.32 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ వసూళ్లు చేసింది. వైజాగ్ ఏరియాలో 5.47 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. గుంటూరులో 6.27 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, నెల్లూరులో 2.11 కోట్లు వచ్చాయి. ఇక కృష్ణా 3.02 కోట్లు, ఈస్ట్ గోదావరి 4.02 కోట్లు, వెస్ట్ గోదావరి 3.60 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ వసూళ్లు చేసింది. సీడెడ్ లో 10.40 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 54.21 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ మూవీ మొదటి రోజు సాధించింది.

Devara Box Office Collections దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయితెలుగు రాష్ట్రాల‌లో షేర్ ఎంతంటే

Devara Box Office Collections : దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల‌లో షేర్ ఎంతంటే..!

రెండో రోజు దేవ‌ర మూవీ నైజాం ఏరియాలో 6.94 కోట్ల వ‌సూళ్లు రాగా…సీడెడ్‌లో 3.77 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఈస్ట్‌, వెస్ట్, కృష్ణ‌, గుంటూరుతో పాటు ప‌లు ఏరియాల్లో కోటి కూడా వ‌సూళ్లను కూడా ఈ మూవీ సొంతం చేసుకోలేక‌పోయింది. రెండు రోజు స‌గానికి పైగా క‌లెక్ష‌న్స్ ప‌డిపోవ‌డం డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌ను షాకింగ్‌కు గురిచేస్తోంది. రెండు రోజుల్లో విత్ ఔట్ జీఎస్టీతో తెలుగు రాష్ట్రాల్లో దేవ‌ర మూవీకి 70.33 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.తొలిరోజుతో పోలిస్తే హిందీలో దేవ‌ర క‌లెక్ష‌న్స్ పెర‌గ‌డం గ‌మ‌నార్హం. శుక్ర‌వారం రోజు దేవ‌ర హిందీ వెర్ష‌న్ 7 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌గా…శ‌నివారం రోజు తొమ్మిది కోట్లు వ‌చ్చాయి. త‌మిళ వెర్ష‌న్ రెండోరోజు కూడా కోటికిపైనే క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది