
Devara Box Office Collections : దేవర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాలలో షేర్ ఎంతంటే..!
Devara Box Office Collections : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూల్ చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే రూ.140 నుంచి రూ.150 వచ్చినట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. డే వన్ రోజు తెలంగాణ, ఏపీలో కలిసి రూ.68 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో రూ.7 కోట్లు, తమిళం రూ.80 లక్షలు, కన్నడ రూ.30, మళయాలంలో రూ.30 వచ్చాయి. అర్ధరాత్రి బెన్ ఫిట్ షోల నుంచి మొదటి రోజు లాస్ట్ షో వరకు తెలుగు రాష్ట్రాలలో దేవర మూవీని చూడటానికి అత్యధిక మంది తరలివెళ్లారు. చాలా వరకు థియేటర్స్ హౌస్ ఫుల్ పడ్డాయి.
‘దేవర’ మొదటి రోజు ఏకంగా 54.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ షేర్ ని ‘దేవర’ మూవీ అందుకుందని తెలిపారు. ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో మొదటి రోజు ఏకంగా 19.32 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ వసూళ్లు చేసింది. వైజాగ్ ఏరియాలో 5.47 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. గుంటూరులో 6.27 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, నెల్లూరులో 2.11 కోట్లు వచ్చాయి. ఇక కృష్ణా 3.02 కోట్లు, ఈస్ట్ గోదావరి 4.02 కోట్లు, వెస్ట్ గోదావరి 3.60 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ వసూళ్లు చేసింది. సీడెడ్ లో 10.40 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 54.21 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ మూవీ మొదటి రోజు సాధించింది.
Devara Box Office Collections : దేవర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాలలో షేర్ ఎంతంటే..!
రెండో రోజు దేవర మూవీ నైజాం ఏరియాలో 6.94 కోట్ల వసూళ్లు రాగా…సీడెడ్‌లో 3.77 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరుతో పాటు పలు ఏరియాల్లో కోటి కూడా వసూళ్లను కూడా ఈ మూవీ సొంతం చేసుకోలేకపోయింది. రెండు రోజు సగానికి పైగా కలెక్షన్స్ పడిపోవడం డిస్ట్రిబ్యూటర్లతో పాటు ట్రేడ్ వర్గాలను షాకింగ్‌కు గురిచేస్తోంది. రెండు రోజుల్లో విత్ ఔట్ జీఎస్టీతో తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీకి 70.33 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.తొలిరోజుతో పోలిస్తే హిందీలో దేవర కలెక్షన్స్ పెరగడం గమనార్హం. శుక్రవారం రోజు దేవర హిందీ వెర్షన్ 7 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా…శనివారం రోజు తొమ్మిది కోట్లు వచ్చాయి. తమిళ వెర్షన్ రెండోరోజు కూడా కోటికిపైనే కలెక్షన్స్ సొంతం చేసుకున్నది.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.