Home » Entertainment » Devi Sri Prasad And Pujita Ponnada Love And Marriage Issue
Entertainment

Devi Sri Prasad : హీరోయిన్ తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి.. అసలు ఈ పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయి

Authored By
aruna
The Telugu News | Published on: September 5, 2022, 7:30 pm
Advertisement

Devi Sri Prasad : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రాక్ స్టార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి విషయం గత కొన్ని సంవత్సరాలుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ మధ్య ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ఈయన ప్రేమలో ఉన్నాడని, ఆమెతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇరు వైపుల కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించడం వల్ల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరిగిన సమయంలో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా వారి బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత ఆ హీరోయిన్ మరో లవ్ లో మునిగి తేలుతుండగా దేవి శ్రీ ప్రసాద్ మాత్రం లవ్‌ ఇష్యూ తో పెద్దగా వార్తల్లో నిలవలేదు. ఇన్నాళ్ల తర్వాత తెలుగు అమ్మాయి, హీరోయిన్ అయినా పూజిత పొన్నాడ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది.

Advertisement

దేవి శ్రీ ప్రసాద్ మరియు పూజిత పొన్నాడ ఎక్కడ ఎలా కలిసి ఉంటారు అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఆ విషయం గురించి పక్కన పెడితే ఇటీవల పూజిత పొన్నాడ ఒక ఇంటర్వ్యూలో తాను ఎవరి తోనూ ప్రేమలో లేను అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మీడియాలో మాత్రం చాలా బలంగా ఇద్దరు మధ్య వ్యవహారం నడుస్తుంది.. త్వరలోనే పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. చెన్నైలో ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ కోసం పూజ పొన్నాడ ఉంటుందని.. ఆమె త్వరలోనే దేవి శ్రీ భార్య కాబోతుంది అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది.. ఇద్దరూ ఎప్పుడు కలిశారుఅనేది ఆసక్తికరంగా మారింది.

Devi Sri Prasad and Pujita Ponnada love and marriage issue

Advertisement

వీరి పరిచయం ఎక్కడి నుంచి మొదలు అయ్యింది అనేది చూస్తే.. రంగస్థలం సినిమాలో పూజిత పొన్నాడ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసింది. ఆ సినిమా సమయం లోనే పూజిత పొన్నాడపై ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన దేవి శ్రీ ప్రసాద్ కి మనసు పడిందట. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. వైజాగ్ కు చెందిన పూజిత పొన్నాడ టాలీవుడ్ లో హీరోయిన్గా సెటిల్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో దేవిశ్రీ తో ప్రేమ మొదలవడంతో కెరీర్ లో ఆమె కాస్త స్లో అయినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి పెళ్లి విషయం ఎంత వరకు నిజం.. అసలు వీరిద్దరి ప్రేమ ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి