Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. భారీ అంచనాల నడుమ సీజన్ 6 తాజాగా మొదలైంది. కొద్ది రోజులుగా షో నిర్వాహకులు చాలా అంచనాలు పెంచారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పాల్గొంటారని ప్రచారం చేశారు. కాని తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల జాడే లేకుండా పోయింది. తాజాగా ప్రకటించిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో . ఒక్కరు కూడా సామాన్యుడు లేడు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు.
యూట్యూబర్ ఆది రెడ్డిని కామనర్ అని అన్నారు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత అతను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు. అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వారిని హౌజ్‌లోకి పంపుతూ ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. బిగ్ బాస్ సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. ఆడిషన్స్ చేసి ఇప్పుడు ఛీటింగ్ చేశారంటూ మండిపడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున అధికారికంగా మే నెలలో విడుదల చేసిన ప్రోమోను యూట్యూబ్ నుంచి తొలగించారు. అంటే.. కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని స్పష్ఠం అవుతోంది.
ఎప్పటి మాదిరిగానే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి పలు రంగాలకు చెందిన సెలబ్స్ హాజరయ్యారు. చివరి కంటెస్టెంట్ (21) గా బిగ్ బాస్ బాస్ -6లోకి సింగర్ రేవంత్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తో చాలా ఫన్నీగా మాట్లాడారు. నాగ్ కూడా రేవంత్ ను మంచి ప్లే బాయ్ అంటూ కామెంట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ భార్య ఆరు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెను వదిలి హౌజ్ లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా రేవంత్ తన భార్య పక్కన లేకపోవతున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజీ పైకి రేవంత్ భార్య కూడా రావడంతో తన గుండెలకు హత్తుకొని, హౌజ్ లోకి వెళ్లాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.