Devi Sri Prasad : ఏంటి సమంత ఐటెం సాంగ్‌ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారా.. దేవి శ్రీ అసహనం..!
ప్రధానాంశాలు:
Devi Sri Prasad : ఏంటి సమంత ఐటెం సాంగ్‌ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారా.. దేవి శ్రీ అసహనం..!
Devi Sri Prasad : ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన దూకుడైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సంగీతం పట్ల తన అభిమానం, ఎనర్జీపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, హాలీవుడ్‌లో తన పాటను కాపీ చేసిన ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.క్లాప్స్ కొడుతూ, సృష్టిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ ఎనర్జీని తగ్గించకూడదు. అది మన క్రియేటివ్ పవర్‌కి బలమైన సూచన దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.

Devi Sri Prasad : ఏంటి సమంత ఐటెం సాంగ్‌ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారా.. దేవి శ్రీ అసహనం..!
Devi Sri Prasad : అది మన రేంజ్..
ఇక్కడితో ఆగకుండా, “నా పాటను హాలీవుడ్‌లో ఎవరో కాపీ చేశారు. అదే మన స్థాయి, మన రేంజ్ అని వాళ్లే నిరూపించారు!” అంటూ గర్వంతో చెప్పారు.ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలోని తన ఇంట్లో కూర్చొని ఐదు నిమిషాలలో పాటని క్రియేట్ చేస్తే దానిని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారు. అది మన రేంజ్ అంటూ కామెంట్ చేశాడు దేవి.
దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఆయన అభిమానులు ఈ వ్యాఖ్యలను గర్వంగా పంచుకుంటున్నారు. గతంలో దేవి శ్రీ కంపోజ్ చేసిన కొన్ని ట్యూన్లు అంతర్జాతీయంగా ఆదరణ పొందాయి. ఇటీవలి కాలంలో ఆయన ఇచ్చిన అద్భుతమైన ఆల్బమ్స్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. DSP వ్యాఖ్యలతో తెలుగు సంగీతం కూడా అంతర్జాతీయంగా తన స్థాయిని నిరూపించుకుంటోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.